ముంజలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసుకోండి.

ఈ సారి వేసవి కాలం ఎండలు దంచి కొడుతున్నాయి, ఈ మండే వేసవిలో తగు జాగ్రత్తలు మరియు సరైన ఆహారం తీసుకోకపోతే తొందరగా వడదెబ్బకు గురయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఇక వేసవి కాలంలో అందరికి అందుబాటులో ఉండి అటు ఆరోగ్యంతో పాటు చల్లదనాన్ని అందించే ఫలాల్లో తాటి ముంజలు ముందు వరుసలో ఉంటాయి. విటమిన్- ఏ, బీ, సీ, ఐరన్, జింక్, ఫాస్పరస్, ఫొటాషియం, కాల్షియం, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండే తాటి ముంజలు ప్రకృతి మనకందించిన వరం. వేసవి కాలంలో వీటిని తినడం వలన మానవ శరీరానికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో క్రింద తెలుసుకోండి.

వేసవిలో అలసట నుండి విముక్తి: 

వేసవిలో ఏ పని చేసిన వెంటనే అలసి పోవడంతో పాటు చెమట రూపంలో శరీరంలో నీటి శాతం త్వరగా తగ్గిపోతుంది. తాటిముంజలు తినడం వలన అలసట తగ్గడమే కాకుండా శరీరానికి త్వరగా నీరు అందుతుంది. అంతే కాకుండా తాటి ముంజలు తింటే వేసవిలో భాదించే వేడి కురుపులు, పొక్కులు, మొటిమలు నుండి ఉపశమనం పొందవచ్చు.

శరీరానికి కావాల్సిన విటమిన్లు లభిస్తాయి: 

మరే ఫలాలో లేనన్ని విటమిన్లు, మినరల్ప్, షుగర్స్ తాటి ముంజలలో ఉంటాయి. వేసవిలో శరీరానికి అవసరమైన విటమిన్- ఏ, బీ, సీ, ఐరన్, జింక్, ఫాస్పరస్, ఫొటాషియం, కాల్షియం లను తాటి ముంజలు మనకు అందిస్తాయి.

క్యాన్సర్‌, కాలేయ సంబంధ వ్యాధులకు చెక్: 

తాటి ముంజల్లో అధికంగా వుండే పొటాషియం, మానవ శరీరంలో ఉండే విషపదార్థాలను తొలగించి కాలేయ సంబంధ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. అంతే కాకుండా తాటి ముంజలు మానవ శరీరంలో ట్యూమర్స్, బ్రస్ట్ కాన్సర్ కణాలు అభివృద్ధి కాకుండా అడ్డుకుంటాయి. అందుకే మనకు ఇన్ని లాభాలను చేకుర్చే తాటి ముంజలను మీ కుటుంబంతో కలిసి తిని ఆరోగ్యంగా జీవించండి.

ఇప్పుడు మన గీతకార్మికులు ముంజకాయలని గ్రామాల నుండి సమీప పట్టణాలకి, నగరాలకు తీసుకొచ్చి అమ్ముతున్నారు, వారి వద్ద మీరు ముంజలని కొనుక్కుంటే మీకు ఆరోగ్యంతో పాటు గీతకార్మికులకి కొంత ఆదాయం లభిస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top