బ్రేకింగ్ న్యూస్: జబర్దస్త్, పటాస్ షోలకు బ్రేక్?? కేంద్రం సంచలన నిర్ణయం

వెండితెర మీద ప్రదర్శించే సినిమాలకు తప్పనిసరిగా సెన్సార్ ఉంటుంది. కాని బుల్లి తెరమీద ప్రసారమయ్యే సీరియల్స్, రియాల్టీ షోలకు ఎటువంటి సెన్సార్, స్క్రీనింగ్ ఉండదు. దీంతో బుల్లి తెరపై ఒక్కొక్కరు పోటీలుపడి రెచ్చిపోతున్నారు. ఆడా మగా తేడాలేకుండా యాంకర్లు, పార్టిస్సెంట్లు ఒకరు మీద పడి దొర్లడం, బాడీ పార్ట్స్ అన్నీ నలిపేస్తుండడం, బూతు డైలాగులు.. అబ్బో ఆ వరస్ట్ ఎపిసోడ్స్ గురించి చెప్పాలంటే చాలా దారుణమనే అనాలి. ఫ్యామిలీ మొత్తం కూర్చుని చూడలేని విధంగా స్మాల్ స్క్రీన్ షోలు, ఎపిసోడ్లు మారిపోయాయి. మరీ చిన్నారులు ఆ సీన్స్, సీరియల్స్ చూస్తే వారి భవిష్యత్ ఏమయిపోతుందోనని తల్లిదండ్రులు వణికిపోతున్నారు. రియాల్టీ షోల్లో బూతులు రాజ్యమేలుతుంటే సీరియల్స్ కుట్రలు, కుతంత్రాలు, క్రైం సీన్లతో నిండిపోయాయి. అందుకే చాలా కాలంగా బుల్లి తెరకు కూడా సెన్సార్ ఉండాలనే డిమాండ్ వస్తోంది. అయితే..

సెన్సార్ బుల్లి తెరకు సాధ్యం కాదని అంతా భావించారు. అయితే ఇటీవల మరీ శృతిమించి కార్యక్రమాలు ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెన్సార్ బుల్లి తెరకు రావాల్సి వస్తోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సెన్సార్ వారు స్వయంగా బుల్లి తెరకు కూడా సెన్సార్ ను తీసుకురావాలని నిర్ణయించారు. టీవీల్లో ప్రసారమయ్యే ప్రతిదాన్ని కూడా సెన్సార్ చేయాల్సిందేనని, త్వరలోనే అందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు బోర్డు ప్రకటించింది. ఆ నిర్ణయం అమలు జరిగితే తెలుగులో జబర్దస్త్, పటాస్ షోలకు కత్తెర్లు పడ్డట్టే..
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top