బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ ఐన తరువాత జ్యోతి చేసిన కామెంట్స్ వింటే షాక్ అవుతారు


స్టార్ మా టివిలో ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ కార్యక్రమం ప్రారంభం అయ్యి రెండు వారలు పూర్తీ అయింది. ఈ బిగ్ బాస్ కార్యక్రమానికి రోజు రోజుకి ఆదరణ పెరుగుతూనే ఉంది. ఈ కార్యక్రమానికి మంచి రేటింగ్స్ కూడా వస్తున్నాయి. మొదట ఊహించిన దాని కన్నా ఎక్కువ స్పందన వచ్చింది ఈ కార్యక్రమానికి . 

మొదటి వారం జ్యోతి  బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేటి అయింది. ఆమె బిగ్ బాస్ హౌస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పింది. బిగ్ బాస్ హౌస్ లో మొత్తం పార్టిసిపెంట్స్ అందరూ నన్నే టార్గెట్ చేసారని నేను ఎక్కడ వారికీ పోటీ అవుతానో అని నన్ను బయటకు పంపేశారని ... అలాగే ముమైత్ ఖాన్ కి నాకు మిస్ అండర్ స్టాండింగ్ జరిగిందని చెప్పింది. జ్యోతి సినీ పరిశ్రమకు హీరోయిన్ అవుదామని వచ్చి కొన్ని సినిమాలలో హీరోయిన్ గా చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారానని చెప్పింది. తన జీవితంలో ఎన్నో అటు పోటులను ఎదుర్కొనన్నని కొన్ని ఆర్ధిక ఇబ్బందుల కారణంగా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒప్పుకొని చేసానని చెప్పింది. బిగ్ హౌస్ నుండి బయటకు రావటం వలన ఎటువంటి బాధ లేదని చెప్పింది 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top