పవర్ స్టార్ గురించి వైరల్ అవుతున్న ఓ ఆసక్తికర విషయం....తెలిస్తే ఆశ్చర్యపోతారు


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం సర్క్యులేట్ అవుతోంది. పవర్ స్టార్ గురించి ఏ విషయం వచ్చిన అభిమానులకు పండుగే. అదే పాజిటివ్ న్యూస్ అయితే పవన్ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అయితే ఈ వార్త పవన్ అభిమానులు మరియు ఎన్టీఆర్ అభిమానులకు ఆనందం కలిగించే వార్త. ఇక విషయంలోకి వెళ్ళితే ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. 

ఈ కార్యక్రమానికి పవన్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తం షాట్‌కు క్లాప్ కూడా కొట్టిన విషయం తెలిసిందే. అయితే కథను రాసుకున్న వెంటనే మళ్లీ పవన్‌తోనే ఆ సినిమాను కూడా తెరకెక్కించాలని భావించారట త్రివిక్రమ్. వెంటనే ఆ కథను పవన్‌కు వినిపించారట. పవన్‌కు కూడా కథ బాగా నచ్చేసిందట. కానీ ఆ కథకు తాను సూట్ కానని.. ఎన్టీఆర్ అయితే బాగా సూట్ అవుతారని పవన్ సలహా ఇచ్చారట. ఆయన సలహా మేరకు త్రివిక్రమ్ కథను ఎన్టీఆర్‌కు వినిపించారని సమాచారం. కథ విన్న ఎన్టీఆర్ వెంటనే ఓకే చెప్పేశారట. ఒక స్టార్ హీరో.. మరో స్టార్ హీరోని సజెస్ట్ చేయడం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిందని తెలుస్తోంది. 
Share on Google Plus