షాకింగ్ - చైతూ సమంతల నిరాడంబర పెళ్ళికి ఖర్చు ఎంతో తెలుసా?


నాగ చైతన్యసమంతలు పెళ్లి చాలా సింపుల్ గా చేసుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆశ్చర్యకరమైన వార్త ఏమిటంటే ఆ సింపుల్ పెళ్ళికి పది కోట్లు ఖర్చు పెడుతున్నట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ప్రేమ జంటగా ఉన్న నాగ చైతన్య,సమంతా ఈ నెల 6 న గోవాలో వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. గోవాలో పెళ్లి పనులను చూసుకోవటానికి అక్కినేని కుటుంబానికి సంబందించిన కొంత మంది డబ్ల్యూ రిసార్ట్ కు వెళ్లినట్టు సమాచారం.

అక్టోబర్ 6వ తారీఖున హిందు సాంప్రదాయంలో 7వ తారీఖున క్రిష్టియన్ సాంప్రదాయంలో జరిగే ఈ పెళ్ళికి అతిధులు అంతా 5వ తారీఖుకే గోవా చేరుకుంటారని తెలుస్తోంది.ఈ వివాహానికి దాదాపుగా 150 మంది అతిధులు హాజరు అవుతున్నారు. అతిధుల రానుపోను ఖర్చులు వారి ఎకామిడేషన్ కోసం తీసుకున్న విలాసవంతమైన హోటల్స్ ఖర్చులు వారికి ఇచ్చే బహుమతులు అన్నీ కలుపుకుంటే కనీసం పది కోట్ల ఖర్చుగా మారబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెలాఖరుకు భాగ్యనగరంలో సమంత చైతన్యల పెళ్ళి రిసెప్షన్ అత్యంత ఘనంగా జరపడానికి నాగార్జున ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి రామ్ చరణ్ అతడి భార్య రానా వెంకటేష్ రాహుల్ రవీంద్రన్ లతో పాటు చాలా తక్కువ మంది మాత్రమే ఈ పెళ్ళికి హాజరు అవుతున్నారు. చైతన్యా సమంతల పెళ్ళిలో ఎక్కువ మంది కుటుంబ సభ్యులే. సింపుల్ పెళ్ళిగా పేరుగాంచిన సమంత - చైతన్యల పెళ్ళి ఈ స్థాయిలో ఉంటే ఘనంగా నిర్వహింపబడే రిసెప్షన్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top