దసరా విన్నర్ మహానుభావుడే..


యూవీ క్రియేషన్స్ వారు నిర్మించిన 'మహానుభావుడు' సినిమాతో శర్వానంద్ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో ఖైదీ, శాతకర్ణి సినిమాలు ఉన్నప్పటికీ శతమానం భవతి సినిమా తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు దసరా బరిలో ఎన్టీఆర్ జై లవకుశ , మహేష్ స్పైడర్ సినిమాలు ఉన్నప్పటికీ 'మహానుభావుడు' తో వచ్చి హిట్ కొట్టాడు. శర్వానంద్ సెంటిమెంట్ మరోసారి వర్క్ అవుట్ అయింది.

ప్రస్తుతం ప్రేక్షకులు జై లవకుశ , స్పైడర్ సినిమాల కన్నా మహానుభావుడు సినిమా వైపే మొగ్గు చూపుతున్నారు. కథ పరంగానే కాకుండా కామెడీ కూడా బాగా ఉండటం వలన విడుదల అయిన మొదటి షో నుంచి మంచి టాక్ రావటంతో ధియేటర్స్ అన్ని ఫుల్ అయ్యిపోయాయి. ఇక ధియేటర్స్ పెంచే ఆలోచనలో ఉన్నారు. 'జై లవకుశ'.. 'స్పైడర్' సినిమాలు రిలీజ్ అవటం వలన మహానుభావుడు సినిమాకి అనుకున్న స్థాయిలో ధియేటర్స్ దొరకలేదు. అయితే టికెట్స్ డిమాండ్ ఎక్కువగా ఉండుట వలన ఈ సినిమా నిర్మాతలు ధియేటర్స్ పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహించాడు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top