అమ్మవారి పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ కె.ఆర్. విజయ గుర్తు ఉందా...తిరుమలలో ఎంత అవమానం జరిగిందో చూడండి


సినీ పరిశ్రమలో ఎవరైనా ఒక పాత్రలో బాగా హిట్ అయ్యారంటే దాదాపుగా వారికీ అటువంటి పాత్రలే ఉంటాయి. అలాంటి కోవలోకి కే ఆర్ విజయ వస్తారు. ఆమె అమ్మవారి పాత్రలకు పెట్టింది పేరు. కె ఆర్ విజయను చూడగానే అమ్మవారి రూపమే గుర్తుకు వస్తుంది. అంతలా ఆమె అభిమానులను ఆకట్టుకున్నారు. కె ఆర్ విజయ తెలుగులో మొదటిసారిగా శ్రీ కృష్ణ పాండవీయం సినిమాలో పౌరాణిక పాత్రను చేసారు. ఎన్టీఆర్ చేయమని అడగటంతో కాదనలేక కె ఆర్ విజయ చేశారట. ఇక అప్పటి నుండి ఆమెకు అటువంటి పాత్రలే ఎక్కువగా రావటం వాటిని చేస్తూ ముందుకు సాగిపోయారు. సినిమా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి సినిమాలోనూ కె ఆర్ విజయ అమ్మవారి పాత్రను చేసేవారు.

అంతలా అమ్మవారి పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ అయ్యిపోయారు కె ఆర్ విజయ. కె ఆర్ విజయ తండ్రి చిత్తూరు జిల్లాకు చెందిన తల్లి మాత్రం కేరళ కు చెందటం వలన కొంత కాలం చిత్తూర్ లో ఉన్నా ఆ తర్వాత కేరళ వెళ్లిపోయారు. కె ఆర్ విజయ చిన్నతనంలో డ్రామాలు వేస్తూ ఉండేది. ఆమె తండ్రి తెలుగువాడు తల్లి కేరళ అయినా కె ఆర్ విజయ సినీ రంగ ప్రవేశము మాత్రం తమిళంలోజరిగింది . సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకున్నారు.

వీరికి హేమలత అనే ఒక కూతురు ఉంది. కె ఆర్ విజయ భర్త ఈ మధ్య కాలంలో మరణించటంతో ఆమె ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నారు. అయితే తన భర్త చివరి కోరిక ప్రకారం తన భర్తను తిరుమలకు తీసుకువచ్చిన సమయంలో సామాన్య భక్తురాలిగా ఎన్నో కష్టాలు పడి దైవ దర్శనం చేసుకుంది. టీటీడీ వారు కూడా పట్టించుకోలేదట. సినిమాల్లో నటిస్తున్నప్పుడు తిరుమల వస్తే రచ్చ మర్యాదలు చేసేవారు. వృధాప్యంలో వస్తే పట్టించుకొనే నాధుడే కరువయ్యాడని వాపోయింది అలనాటి అమ్మవారి పాత్రలను వేసిన కె ఆర్ విజయ.
Share on Google Plus