బాణ పొట్ట రావటానికి అసలు కారణాలు ఇవే...ఈ తప్పులు మీరు చేస్తున్నారా...?

గతంలో కొన్ని వర్గాల మధ్యలో మాత్రమే బాణ పొట్ట ఉండేది. ఇప్పుడు అన్ని వర్గాలలోను,అన్ని వయస్సుల వారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. అసలు బాణ పొట్ట అంటే పొట్ట చుట్టుపక్కల అదనంగా కొవ్వు పేరుకుపోవటం. దీనికి చిన్నా పెద్ద అనే తేడా లేదు. చిన్న వయస్సులోనే దీని బారిన పడటం వలన అందవిహినంగా కనపడటమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

అసలు ఇది రావటానికి ఒక కారణం అంటూ ఉండదు. ఎన్నో కారణాల వలన పొట్ట పెరిగే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల్లో కనిపించే పొట్టకు సరైన వ్యాయామం లేకపోవటం కారణం అని చెప్పవచ్చు. వారు ఆటలు ఆడకుండా ఒకే చోట కూర్చోవటం,టీవి,కంప్యుటర్ ఎక్కువగా చూస్తూ కూర్చోవటం,జంక్ ఫుడ్ పట్ల ఆకర్షితులు అవ్వటం వంటి కారణాల వలన కూడా పొట్ట చిన్న వయస్సులోనే వస్తుంది.

ఇదే విధంగా వారితో పాటు పొట్ట కూడా పెరిగి పెద్దది అవుతుంది. అయితే చాలా మందిలో ఇలా ఉన్నా,కొంత మంది పొట్టను తగ్గించుకుంటూ న్నారు. పొట్ట వచ్చిన తర్వాత చర్యలు చేపట్టడం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.

రోజులో ఏ ఒక్కసారో కాకుండా గంట గంటకు ఒక గ్లాస్ నీరు త్రాగుతూ ఉండాలి. శరీరంలో మలినాలను బయటకు పంపటానికి నీరు సహాయపడుతుంది. అంతేకాక తీసుకున్నా ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది. ఆహారం తీసుకొనేటప్పుడు గబగబా కాకుండా నిదానంగా తినాలి. బరువును ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి.
Share on Google Plus