బ్రకోలి నోటి క్యాన్సర్ ని తగ్గిస్తుందా?

బ్రకోలి...ఆరోగ్యపరంగా తీసుకొనే ఆహారపదార్దాల లిస్ట్ లో చాలా తరచుగా విన్పించే మాట. మిగతా కూరగాయల మాదిరిగా విరివిగా దొరకదు. అయినా ఇటీవల కాలంలో బ్రకోలి వాడకం బాగా పెరిగింది. దీని మొలకలు నోటి క్యాన్సర్ ని అద్భుతంగా అడ్డుకుంటాయని పిట్స్ బర్గ్ యునివర్సిటి వైద్యులు తమ పరిశోదనలో కనుగొన్నారు. 

నోటి క్యాన్సర్ తో బాధ పడుతున్న ఎలుకలకు బ్రోకలితో తయారుచేసిన పదార్దాలను తినిపించారు. కొంత కాలం అయిన అయిన తర్వాత వాటిని పరిశీలించగా నోటిలో పుళ్ళు తగ్గటాన్ని గమనించారు. ఆ తర్వాత మనుషులకు బ్రకోలి ఆకులతో తయారుచేసిన పొడితో తయారుచేసిన గుళికలను ఇచ్చి పరిశీలన చేసారు. కొన్ని రోజుల తర్వాత వారిని పరిశీలన చేస్తే మంచి పలితాలు కన్పించాయని పరిశోదకులు అంటున్నారు.

క్యాబేజీ సంతతికి చెందిన బ్రకోలి మొలకలలో నోటి క్యాన్సర్ ని తగ్గించే అణువులను గుర్తించామని వీరు అంటున్నారు. నోరు,గొంతు క్యాన్సర్ బారిన పడిన వారికీ ఎంత మొత్తంలో బ్రకోలి ఇస్తే మంచిదనే విషయం మీద ఇంకా పరిశోదనలు జరుగుతున్నాయి.
Share on Google Plus