లిప్ స్టిక్ ఎలా వేసుకోవాలో తెలుసా?

లిప్ స్టిక్ వేసుకొనే ముందు పెదాలు తాజాగా,ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అనేది గమనించాలి. లేదంటే ఎంత మంచి లిప్ స్టిక్ వేసుకున్నా కళ రాదు. మరి పెదాలు ఆరోగ్యంగా,తాజాగా కన్పించాలంటే ఏమి చేయాలి. ముఖ సంరక్షణ మీదే కాదు పెదాల ఆరోగ్యం మీద కూడా శ్రద్ద పెట్టాలి. కనీసం వారానికి ఒకసారైన పెదాలపై పేరుకున్న మృత కణాలను తొలగించి మంచి నాణ్యమైన లిప్ బామ్ రాయాలి. దీని వలన పెదాలకు తేమ అందుతుంది.

మెరిసే లిప్ స్టిక్ అన్ని సందర్భాలకు సెట్ కాదు. అలాగే రంగులను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. చర్మ తత్వానికి నప్పే రంగును ఎంచుకుంటే పెదాలు అందంగా కనపడతాయి.

పెదాలకు లిప్ స్టిక్ వేసుకొనే ముందు వాటికీ కొద్దిగా ప్రైమర్ రాసుకొని లిప్ స్టిక్ వేసుకుంటే లిప్ స్టిక్ బాగా కనపడుతుంది. ఎక్కువసేపు కూడా ఉంటుంది. ప్రైమర్ లేకపోతె పౌండేషన్ అయినా రాయవచ్చు. కేవలం లిప్  స్టిక్ ఒక్కటే కాదు లిప్ లైనర్ ని కూడా తప్పనిసరిగా వాడాలి. పెదాల రంగుకు దగ్గరగా ఉన్న లైనర్ ని ఎంచుకోవాలి. లిప్ స్టిక్ ను ముందుగా పెదాల మధ్య నుంచి వేసుకుంటూ రావాలి. లిప్ బ్రష్ తో వేసుకుంటే పెదాలపై చక్కగా పరుచుకుంటుంది.

లిప్ స్టిక్ పూర్తిగా వేసుకున్నాక టిష్యు పేపర్ తో అద్దుకోని, మరోసారి లిప్ స్టిక్ వేసుకోవాలి. టిష్యు తో అద్దుకోవటం వలన అధికంగా ఉన్న జిడ్డు తొలగిపోతుంది. రెండో సారి లిప్ స్టిక్ వేసుకోవటం వలన పెదాలు మెరుస్తాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top