ముఖానికి ఫేషియల్ అవసరమా?

ఫేషియల్ వలన చర్మం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా వయస్సుతో పాటు వచ్చే ముడతలు,పోడితనం వంటివి మెల్లగా తగ్గిపోతాయి. రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది. ఎప్పుడో ఒక్కసారి ఫేషియల్ చేయించుకుంటే దాని ప్రభావం పెద్దగా ఉండదు. నెలకు ఒకసారి తప్పనిసరిగా ఫేషియల్ చేయించుకోవాలి. ఫేషియల్ చేయించుకొనే ముందు మీ చర్మ తత్వం ఏమిటో తెలుసుకోవాలి. జిడ్డు చర్మం ఉన్న వారికీ ఆయిల్ మసాజ్ చేయకుండా హైడ్రో మసాజ్ (అంటే వాటర్ బేస్డ్ మసాజ్) చేయాలి. 

ఇందులో ఫ్రూట్ జెల్ ని ఉపయోగిస్తారు. డ్రై, నార్మల్ స్కిన్ కి ఆయిల్ మసాజ్ చేయాలి. నువ్వుల నూనె, సన్ ఫ్లవర్ ఆయిల్,సోయా ఆయిల్,బాదం నూనె వంటి నూనెలను మసాజ్ కి ఉపయోగిస్తారు. ఫేషియల్ మరింత చక్కగా ఉండాలంటే అరోమా ఆయిల్ ని ఉపయోగించవచ్చు. ఫేషియల్ చేయటానికి ముందు చర్మాన్ని శుభ్రపరుచుకోవాలి. దీని కోసం నాణ్యమైన ఫేస్ వాష్ గాని క్లిన్సింగ్ మిల్క్ గాని ఉపయోగించాలి. ఆ తర్వాత ఆరెంజ్ లేదా యాప్రికాట్ స్క్రబ్ ని ఉపయోగించాలి. 

ఐదు నిమిషాల తర్వత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకొని పైన చెప్పిన ఏదైనా ఒక ఆయిల్ తో సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేయాలి. మొదట బుగ్గల నుండి చుబుకం పైకి, ఆ తర్వాత నుదుటి పైన తేలికగా చేతి వేళ్ళతో మసాజ్ చేయాలి. ఈ విధమైన మసాజ్ 15 నుంచి 20 నిమిషాల పాటు చేయాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top