జుట్టు ఊడిపోతుందా? అయితే ఈ మార్పులను చేయండి


తలస్నానం చేసినప్పుడు,జుట్టు దువ్వు కుంటున్నప్పుడు ఊడి చేతికి వచ్చే జుట్టును చూస్తే చాలా బాధ కలుగుతుంది. అయితే మీ జీవనశైలిలో కొన్ని మార్పులను చేసుకుంటే జుట్టు ఊడటాన్ని తగ్గించవచ్చు.

ధూమపానం వలన రక్త నాళాలు మందంగా మారి జుట్టు కుదుళ్ళకు రక్త సరఫరా సరిగ్గా జరగదు. దాంతో క్రమంగా జుట్టు సహజ రంగును కోల్పోతుంది. కుదుళ్ళు బలహీనపడి రాలిపోతాయి.

మనిషికి సాదారణంగా రోజుకి ఎనిమిది గంటల నిద్ర అవసరం. ఆ పాటి నిద్ర లేకపోతె ఒత్తిడి పెరిగి హార్మోన్స్ హానికరమైన రసాయనాలుగా మారతాయి.

శరీరంలోని విష పదార్దాలను సమర్ధవంతంగా బయటకు పంపే ఏకైక మార్గం వ్యాయామం.ప్రతి రోజు చెమట పట్టేలా వ్యాయామం చేస్తే చర్మానికి,కుదుళ్ళకు రక్త సరఫరా బాగా పెరిగి ఆరోగ్యంగా ఉంటాయి.

తలస్నానానికి అరగంట ముందు గోరువెచ్చని కొబ్బరి నూనెతో తలకు మర్దన చేయండి. కొబ్బరి నూనె తలకు మంచి కండిషనర్ గా పనిచేస్తుంది.

ఘాటైన రసాయనాలు ఉన్న షాంపూ లను వాడకుండా తేలికపాటి షాంపూలను వాడాలి.అధిక వేడి,అధిక చల్లదనం రెండు జుట్టుకు హానికరమే. కాబట్టి ఏసీ లలో పనిచేసేవారు తప్పనిసరిగా తలకు ఊలు తో తయారైన టోపిని పెట్టుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top