కండరాల శక్తి కోసం....బీట్ రూట్...???

కొందరు చూడటానికి ఎంత ఆరోగ్యంగా కనిపించినా...కండరాల బలం మాత్రం ఉండదు. అటువంటి వారు కండరాల బలాన్ని సొంతం చేసుకోవాలంటే తప్పనిసరిగా బీట్ రూట్ రసాన్ని త్రాగావలసిందే. అందులో నైట్రేట్స్ అధికంగా ఉండుట వలన మన శరీరానికి నైట్రిక్ ఆమ్లాన్ని అందిస్తాయి. అంతేకాక జీవక్రియల రేటును మెరుగుపరుస్తాయి. గుండె నుంచి శరీరం అన్ని బాగాలకు ముఖ్యంగా కండరాలకు రక్త ప్రసరణ బాగా అందేలా సహాయపడుతుంది. 

అలాగే గుండెకు సంబందించిన శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారు ప్రతి రోజు కొన్ని రోజుల పాటు బీర్ రూట్ రసాన్ని త్రాగించటం వలన కండరాలు,శరీరం దృడంగా తయారు అవుతాయని వైద్యులు అంటున్నారు. నైట్రేట్స్ శరీరానికి సమృద్దిగా అందటం వలన శరీరంలో రక్త నాళాలు ఉత్తేజితమై రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది. దీని వలన కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి. అందుకే వయస్సు పెరిగే కొద్ది బీట్ రూట్ రసానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 

కనీసం వారానికి రెండు సార్లు అయిన బీట్ రూట్ రసాన్ని తీసుకోవాలి. ఒక వేళ బీట్ రూట్ రసం త్రాగటానికి ఇష్టం లేనివారు ఆహారం ద్వారా కూడా తీసుకోవచ్చు. కాకపోతే బీట్ రూట్ ని పచ్చిగా తీసుకుంటేనే మంచి పలితాలు ఉంటాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top