సాదారణంగా షాంపూ లేదా కుంకుడు కాయలతో తలస్నానం చేసాక జుట్టు బాగా చిక్కిపడటం జరుగుతూనే ఉంటుంది. అలా ఉన్న సమయంలో జుట్టును దువ్వటం చేస్తే అధికంగా జుట్టు రాలటం జరుగుతుంది. ఆ విధంగా జరగకుండా ఉండాలంటే చిక్కు ఉన్న ప్రదేశంలో బేబి టాల్కం పౌడర్ రాసుకొని జుట్టు దువ్వితే సులభంగా చిక్కు పోతుంది.
అలాగేమరో చిట్కా కూడా ఉంది. కొబ్బరి నూనె వలే కొబ్బరిపాలు కూడా జుట్టుకు చాలాసహాయపడతాయి. అంతేకాక జుట్టు అందాన్ని పెంచటంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఈ పాలను తలకు ఉపయోగించటం కూడా ఒక మంచి చిట్కా. షాంపూతో తలస్నానం చేసే ముందు కొబ్బరి పాలతో మాడును మర్దన చేయాలి. అలాగే ఈ పాలను తల స్నానం అయ్యాక నూనె వలే కూడా రాసుకోవచ్చు. కొబ్బరి పాలల్లో జిడ్డు ఉండదు కాబట్టి మంచి కండిషనర్ గా కూడా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు కూడా త్వరగా చిక్కులు పడదు. ఈ చిట్కాలను పాటిస్తే జుట్టు చిక్కులు పడదు.