త్రేన్పులు తగ్గటానికి కొన్ని చిట్కాలు

కడుపులో గ్యాస్ వలన వచ్చే త్రేన్పులు కొన్ని అనారోగ్య చిహ్నాలే కాకుండా చుట్టూ ఉన్న వారిని కూడా ఇబ్బంది పెడతాయి. వీటి నివారణకు మందులు కన్నా చిట్కా వైద్యమే బాగా పనిచేస్తుంది.
నెమ్మదిగా తినటం

తీసుకొనే ఆహారాన్ని త్వర త్వరగా తినటం వలన కడుపులోకి గాలి వెళ్ళే అవకాశం ఉంది. అందువల్ల ఆహారాన్ని నెమ్మదిగా తినటం అలవాటు చేసుకోవాలి. నెమ్మదిగా తినటం వలన ఎక్కువ తిన్నామన్న భావన కలిగి తక్కువ మొత్తంలో తింటాం.

సోంపు
ఇది అందరికి తెలిసిన వైద్యమే. భోజనం చేసిన వెంటనే కొన్ని సోంపు గింజలు తినటం అలవాటు చేసుకుంటే త్రేనుపుల సమస్య నుండి బయట పడవచ్చు.

నీరు
గంటకొకసారి ఒక గ్లాస్ చొప్పున నీటిని త్రాగితే త్రేన్పుల నుండి బయట పడవచ్చు. ఈ విధంగా నీటిని తీసుకోవటం వలన ఆహారం బాగా జీర్ణం అవుతుంది.

చల్లని పానీయాలు
తరచుగా కూల్ డ్రింక్స్ త్రాగటం కూడా త్రెన్పులకు కారణం అవుతుంది వీటితో భాద పడేవారువీటికి దూరంగా ఉండాలి.

లవంగాలు
త్రేన్పుల నుండి తప్పించుకోవటానికి ఇది ఒక మంచి చిట్కా. భోజనం చేసిన వెంటనే ఒకటి,రెండు లవంగాలు నమలటం మంచిది.
Share on Google Plus