మృదువైన మరియు అందమైన చేతుల కోసం Tips

సాదారణంగా ప్రతి ఒక్కరు ముఖం మీద పెట్టిన శ్రద్ధను చేతుల మీద పెట్టరు.అందువల్ల మనం చేతులను మృదువుగా మరియు అందంగా ఎలా చేసుకోవచ్చో తెలుసుకుందాం. మన చేతులకు వృద్దాప్య లక్షణాలు వచ్చినప్పుడు సాగినట్టుఅన్పిస్తాయి. కేవలం చేతులు మాత్రమే వృద్ధాప్యం యొక్క తీవ్రమైన సంకేతాలను చూపుతుంది. సాదారణంగా చేతులను వంట సామాను తోమటం, బరువులు ఎత్తడం,డ్రైవింగ్ వంటి వాటిని చేయటం కోసం ఉపయోగిస్తూ ఉంటాం. అందువల్ల కొన్నిప్యాక్స్ చేతులకు వేసుకుంటే మంచిది.

బట్టలు ఉతికినప్పుడు,వంట సామాను తోమినప్పుడు, కఠినమైన రసాయనాలు మరియుడిటర్జెంట్ల నుండి చేతులను రక్షించుకోవటానికి చేతి తొడుగులను (గ్లౌజ్)ఉపయోగించాలి. ఈ చేతి తొడుగులను వేసుకోవటానికి ముందు చేతులకు ఆలివ్ ఆయిల్లేదా హోం మెడ్ క్రీం రాసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన చేతులు మృదువుగామారతాయి. చేతులు కఠినమైన, పొడిగా, ముడుతలు,లైన్స్ వంటివి లేకుండా
ఉండాలంటే కొన్ని ప్యాక్స్, క్రీమ్స్ రాసుకోవాలి. ఇప్పుడు వాటిని ఎలాతయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

1. చేతి స్క్రబ్
మృదువైన మరియు అందమైన చేతుల కోసం చక్కెర మరియు ఆలివ్ నూనెతో మనంసొంతంగా ఇంటిలోనే చేతి స్క్రబ్ తయారుచేసుకోవచ్చు. ఆలివ్ నూనె,తీపి బాదంనూనె, జోజోబ నూనెలలో ఏ నూనెను అయిన ఉపయోగించవచ్చు. ఒకవేళ మనకు నూనెఅందుబాటులో లేకపోతే నిమ్మరసంను ఉపయోగించవచ్చు. నిమ్మరసంలో పంచదార వేసిస్క్రబ్ గా తయారుచేసుకోవచ్చు.

కావలసినవి
ఆలివ్ నూనె - 1 స్పూన్
చక్కెర - 2 స్పూన్స్
నిమ్మ రసం - కొంచెం ( చర్మం టోన్ తేలికగా ఉండి, చేతులు నిస్తేజంగా
కనపడితే ఉపయోగించండి)
పద్దతి
1. ఒక బౌల్ లో ఆలివ్ నూనె, చక్కెర, నిమ్మరసం( అవసరమైతే) వేసుకొని బాగా కలపాలి.
2. ఈ చేతి స్క్రబ్ ని నిదానంగా చేతి వేళ్ళ మధ్య,అరచేతులు,మొత్తం చేయిఅంతా రాసి 2 నుంచి 3 నిముషాలు మర్దన చేయాలి.
3. ఆ తర్వాత చేతులను శుభ్రం చేసుకుంటే మృదువైన మరియు అందమైన చర్మం సొంతం అవుతుంది.
4. చేతులను శుభ్రం చేసుకోవటానికి సబ్బు లేదా హ్యాండ్ వాష్ ఉపయోగించకూడదనిగుర్తు పెట్టుకోవాలి.

2. డై హ్యాండ్ ఎక్స్ ఫ్లోట్
ఎక్కువ రసాయనాలు, నీరు, డిటర్జెంట్లు, పొడిగా మారటం,పగలటం వంటి సమస్యలుఎక్కువ అయినప్పుడు చర్మం ఎక్స్ ఫ్లోట్ కి గురి అవుతుంది. ఈ విధంగా ఎక్స్ ఫ్లోట్ కి గురి అయిన చేతులకు డై హ్యాండ్ ఎక్స్ ఫ్లోట్ ఉపయోగిస్తే చేతులుమృదువుగా మారి అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. దీనిని పొడి మోచేతులు,మోకాళ్ళు, పాదాలు, మడమల పగుళ్లు వంటి అన్నింటికీ నయం చేయటానికిఉపయోగించవచ్చు.

చక్కెర చర్మం కోసం ఒక సహజమైన ఎక్స్ ఫ్లోట్ గా ఉంటుంది. నట్స్ అలెర్జీఉంటే మాత్రం నట్స్ నూనెలను ఉపయోగించకూడదు. నూనెలను చర్మానికి రాయటానికిముందు పలుచన చేయాలి.

కావలసినవి
చక్కెర - అరకప్పు
ఆలివ్ నూనె - 2 స్పూన్స్
అవోకాడో నూనె - 2 స్పూన్స్
రైస్ బ్రాన్ నూనె - 2 స్పూన్స్
గంధపు ఎస్సెన్షియాల్ ఆయిల్ - కొన్ని చుక్కలు ( ఇష్టమైతే)
లవెందర్ నూనె- కొన్ని చుక్కలు

పద్దతి
1. ఒక బౌల్ లో చక్కెర, ఆలివ్ నూనె,అవోకాడో నూనె, రైస్ బ్రాన్ నూనె, గందంనూనె, లావెండర్ నూనె వేసి బాగా కలిసేలా కలపాలి.
2. ఈ మిశ్రమాన్ని చేతులకు రాసి రెండు నిమిషాల పాటు శాంతంగా స్క్రబ్ చేయాలి.
3. ఆ తర్వాత చేతులను సబ్బును ఉపయోగించకుండా శుభ్రం చేయాలి.
4. పొడి చర్మం,మొటిమలు ఉన్నవారు ఈ స్క్రబ్ ని ముఖానికి కూడా ఉపయోగించవచ్చు.
5. నిస్తేజంగా మరియు పొడి చర్మం ఉన్న వారు ఈ స్క్రబ్ ను ఉపయోగించాక ముఖం
మృదువుగా మారటం గమనించవచ్చు.
Share on Google Plus