White Teeth :దంతాలు తెల్లగా మెరవాలంటే సహజమైన ఇంటి చిట్కాలు



దంతాలు పసుపుపచ్చగా మారాయని బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఇంటిలోసులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో దంతాలను తెల్లగా మెరిసేలా చేయవచ్చు.దంతాలు పాలిపోవటం అనేది వృద్ధాప్య ప్రక్రియలో ఒక బాగం. అయితే దంతాల మీదమరకలు,పాలిపోవటం వంటి సమస్యలకు సులభమైన ఇంటి పరిష్కారాలు ఉన్నాయి. వందడాలర్ల బ్లీచింగ్ ట్రేలు, దంతవైద్యుడి దగ్గరకు వెళ్ళటం మరియు తెలియనిరసాయన సొల్యూషన్స్ వంటివి వాడకుండా కేవలం ఇంటిలో సులభంగా దొరికే వస్తువులతో దంతాలను తెల్లగా మెరిసేలా చేయవచ్చు.


1. స్ట్రాబెర్రీలు తినాలి
స్ట్రాబెర్రీలలో మాలిక్ ఆమ్లం అనే ఎంజైము మరియు విటమిన్ సి సమృద్దిగాఉండుట వలన దంతాలు తెల్లగా మారటానికి సహాయపడుతుంది. స్ట్రాబెర్రీలలోకనిపించే ఆస్ట్రిజెంట్ దంతాల ఉపరితల మరకలను తొలగించడానికి సహాయపడుతుంది.స్ట్రాబెర్రీ పేస్ట్ ని ఉపయోగించి వారంలో ఒకసారి లేదా రెండుసార్లు
దంతాలను తోముకుంటే మంచి పలితాలు కనపడతాయి. ఒకవేళ స్ట్రాబెర్రీలను తింటేకనుక బాగా నమిలి తినాలి.


2. పళ్ళ మధ్య దారంతో శుభ్రం చేయుట (ప్లాసింగ్ )
కొంత మందికి దంతాలను తోముకున్న పళ్ళ మధ్య మరకలు అలానే ఉండిపోతాయి. అయితేకొంత మంది దంత వైద్యులు బ్రషింగ్ కన్నా ఫ్లాసింగ్ ముఖ్యమని అంటున్నారు.మంచి పలితాలను పొందటానికి ప్రతి రోజు రెండు సార్లు ప్లాసింగ్ చేయాలి. ఈవిధంగా చేయుట వలన పళ్ళ మధ్య మరకలు పోయి తెల్లగా మెరుస్తాయి.


3. బేకింగ్ సోడా మరియు నిమ్మకాయ
ఇది దంతాలను తెల్లగా చేయటానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.నిమ్మరసం,బేకింగ్ సోడా యొక్క రసాయన చర్య కారణంగా దంతాలు తెల్లగామెరుస్తాయి. ఈ రెండు కలవటం వలన చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఈద్రావణాన్ని వారానికి ఒకసారి మాత్రమే ఉపయోగించాలి. చిగుళ్ళకు చికాకుగా
ఉంటే మాత్రం బేకింగ్ సోడా వాడకాన్ని ఆపేయాలి. అంతేకాక ఎనామిల్ కి హానికలుగుతుందని భయం ఉంటే ఇతర పరిష్కారాల కోసం చూడాలి.


ఒక బౌల్ లో తాజా నిమ్మరసం తీసుకోని దానిలో కొంచెం బేకింగ్ సోడా కలపాలి. ఈమిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పళ్లకు రాయటానికి ముందు పళ్ళ మీదఉన్న లాలాజలంను కాటన్ బాల్ తో శుభ్రం చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పళ్ళమీద రాసి ఒక నిమిషం అయ్యాక నిదానంగా బ్రష్ చేయాలి. ఈ మిశ్రమాన్ని దంతాలమీద ఒక నిమిషం కన్నా ఎక్కువ సమయం ఉంచకూడదు. ఒకవేళ ఉంటే కనుక ఎనామిల్ దెబ్బతింటుంది.


4. పండ్లు మరియు వెజ్జీలను నమిలి తినాలి
యాపిల్స్, ఆకుకూరలు మరియు క్యారెట్లు పళ్లకు చాలా బాగా సహాయపడతాయి.కరకరలాడే పండ్లు మరియు కూరగాయలను ప్రకృతి ఇచ్చిన బ్రష్ అని చెప్పవచ్చు.వీటిని నమలటం వలన నోటిలో ఉండే అధిక ఆహారం మరియు బాక్టీరియాను తొలగించటంలోసహాయపడుతుంది. అలాగే మరకలను కూడా తొలగిస్తుంది. పండ్లు మరియు కూరగాయలలోఉండే ఆమ్లాలు ఆహార కణాలు మరియు బాక్టీరియాను తొలగించటమే కాక పళ్ళనుతెల్లగా చేస్తాయి. యాపిల్ లో ఉండే మాలిక్ ఆమ్లం పళ్ళ ఉపరితలం మీద ఉండే మరకలను కూడా తొలగిస్తుంది.


5. నూనెను పుక్కిలించుట (ఆయిల్ పుల్లింగ్)
ఆయిల్ పుల్లింగ్ అనేది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి మరియు శరీరంశుభ్రపరచడానికి ప్రధానంగా ఉపయోగించే ఒక భారతీయ నివారణ మార్గం అనిచెప్పవచ్చు. నిజానికి ఈ ప్రక్రియ చాలా సరళమైనది, ప్రమాద రహితం మరియుచాలా చవకైనది. ఒక స్పూన్ స్వచ్ఛమైన, సేంద్రీయ నూనెను నోటిలో పోసుకొని 15నుంచి 20 నిమిషాల పాటు పుక్కిలించి ఊయాలి. ఆ తర్వాత రెండు గ్లాసుల నీటితో నోటిని బాగా శుభ్రం చేసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top