కాఫీలో ఉండే మైండ్ బ్లోయింగ్ ప్రయోజనాలు...అసలు నమ్మలేరు


Amazing Benefits of Coffee for Skin

Amazing Benefits of Coffee for Skin : ప్రతి రోజు ఉదయం లేవగానే ప్రతి ఒక్కరికి కాఫీ పడాల్సిందే. కాఫీ పడకపోతేనిస్సత్తువుగా ఉంటుంది. అదే కాఫీ తాగితే చాలా ఉషారుగా ఉంటారు. అలాంటి కాఫీ చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది. ఆశ్చర్యంగా ఉందా? అయితే ఈ ఆర్టికల్ చూస్తే మీకే అర్ధం అవుతుంది. ఇప్పుడు ఆ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

కాఫీ పొడి మంచి స్క్రబ్ గా పనిచేస్తుంది. ఒక స్పూన్ కాఫీ పొడిలో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఈ విధంగా చేయటం వలన మృతకణాలు తొలగిపోతాయి.

తలలో చర్మం మీద మృతకణాలు ఉంటే అది చుండ్రుకు దారి తీస్తుంది. కాఫీ పొడిలో కొంచెం నీటిని కలిపి పేస్ట్ గా తయారుచేయాలి. ఈ పేస్ట్ ని తలకు పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.

కాఫీ కంటి ఉబ్బును తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. కాఫీపొడిలో నీటిని కలిపి ఐస్ ట్రై లో పోసి ఫ్రీజర్ లో పెట్టి ఐస్ అయ్యాక ఐస్ క్యూబ్ ని తీసుకోని కంటి ఉబ్బు మీద రబ్ చేయాలి. ఈ విద్మగా తరచుగా చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.
Share on Google Plus