బియ్యం పిండిని ఇలా వాడితే ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మారుతుంది

Benefits of Rice Flour for Skin


Benefits of Rice Flour for Skin :చర్మం తెల్లగా కాంతివంతంగా అవ్వాలంటే ఎన్నో రకాల క్రీమ్స్ వాడుతూ ఇంటి ప్రోడక్ట్స్ ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం.కానీ ముఖానికి ఇంటి ప్రోడక్ట్స్ ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తాయి. మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్స్ లో హానికరమైన రసాయనాలు ఉంటాయి. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఎటువంటి ససైడ్ ఎఫెక్ట్ లేని ఇంటి ప్రోడక్ట్ బియ్యంపిండిని ఉపయోగించి ముఖం మీద అద్భుతాన్ని చేయవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.

బియ్యంపిండి,కలబంద జెల్,తేనే కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి 20 నిముషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయటం వలన మొటిమలు,మొటిమల మచ్చలు,నలుపుదనం పోయి ముఖం అందంగా మారుతుంది.

బియ్యం పిండి మంచి ఎక్స్ ఫోలియేటర్ గా పనిచేస్తుంది. ఒక బౌల్ లో బియ్యం పిండి, శనగపిండి, తేనె, పంచదార, కొబ్బరినూనె కలుపుకోవాలి. దీన్ని స్ర్కబ్ లా ఉపయోగిస్తే మృత కణాలు తొలగిపోయి తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది.

ఒక బౌల్ లో బియ్యం పిండి. ఎగ్ వైట్, తేనె కలిపి ముఖానికి పట్టించాలి. ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ అన్ని రకాల చర్మ తత్వాలకు సెట్ అవుతుంది. ఈ ప్యాక్ వల్ల ముడతలు, ఫైన్ లైన్స్ తొలగిపోయి చర్మం టైట్ గా ఉంటుంది.
Share on Google Plus