Orange-మూడ్ ని మార్చే అద్భుతమైన Fruits

Your mood Good Foods


Your mood Good Foods : మీకు తరచుగా మూడ్ మారుతుందా? మూడ్ మారి చాలా చికాకుగా ఉంటుందా? అయితే ఈ పండ్లను రెగ్యులర్ గా తీసుకుంటే మీ మూడ్ బాగుంటుంది. ఈ పండ్లు మీ మూడ్ ని మార్చటమే కాకుండా తక్షణ శక్తిని ఇస్తాయి. మనం తీసుకొనే ఆహారంతో పాటు వీటిని కూడా ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. ఇప్పుడు ఆ ఆహారాల గురించి తెలుసుకుందాం.

బెర్రీలు
బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండుట వలన మూడ్ బాగుండేలా చేస్తాయి. అంతేకాక తక్షణ శక్తిని అందిస్తాయి. బెర్రీలు తినటం వలన బలం కూడా కలుగుతుంది.

చెర్రీలు
చెర్రీ పండులో సమృద్ధిగా ఉండే మెలటొనిన్ మంచి నిద్ర కలిగిస్తుంది. తిని పడుకుంటే, సంతోషంగా లేచి చురుకుగా పని చేసుకుంటారు. అంతేకాక చెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

ఆరెంజ్
విటమిన్ సి వుండే పండ్లను రెగ్యులర్ గా తీసుకుంటే లేచి ఉత్సాహముగా పని మూడ్ లోకి వెళ్ళటానికి సహాయపడుతుంది.

జామ్
వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లు మీకు తక్షణ శక్తినిస్తాయి. శరీరంలో తయారయ్యే సెరోటోనిన్ కు యాంటీగా పని చేసి ఉత్సాహాన్నిస్తాయి. మీ ప్రతి రోజు ఆహారంలో పైన తెలిపిన పండ్లు అదనంగా చేర్చి మీ మూడ్ మరింత మెరుగు పరచుకోండి. ఈ ఆహారాలు మీ మూడ్ మీద ప్రభావం చూపుతాయి. కాబట్టి రెగ్యులర్ డైట్ లో ఈ పండ్లు ఉండేలా చూసుకోండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top