గ్యాస్, అసిడిటీ స‌మ‌స్య‌లా..? అయితే ఇలా చెక్ పెట్టండి ...

Gas problem home remedy in telugu


Gas problem home remedy in telugu : ఈ రోజుల్లో గ్యాస్ సమస్య అనేది వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూసాధారణ సమస్యగా మారిపోయింది. ఈ సమస్యని అధికమించటానికి చాలా చిట్కాలు ఉన్నాయి. అయితే గ్యాస్ సమస్యను అధికం చేసే ఆహారాలకు దూరంగా ఉంటే కొంత గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఇప్పడు ఆ ఆహారాల గురించి వివరంగా తెలుసుకుందాం.

కొన్ని పప్పు ధాన్యాలు, బీన్స్, మష్రూమ్స్, ఆపిల్స్ మొదలైన షుగర్ కంటెంట్అ ధికంగా వుండే ఆహారాలను శరీరం సరిగా జీర్ణం చేసుకోలేదు. అలాంటి సమయంలో గ్యాస్ సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఆహారాలకు దూరంగా ఉండటమే బెటర్.

కొంతమందికి పాల ఉత్పత్తుల కారణంగా గ్యాస్ ఏర్పడుతుంది. పాలలో ఉండే లాక్టోజ్ సరిగా జీర్ణం కాక గ్యాస్ సమస్య ఉత్పన్నం అవుతుంది. అందువల్ల జున్ను, పాలు, గుడ్లు, గుడ్డు సొన వంటి గ్యాస్ సమస్యను అధికం చేసే ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిది. ఒకవేళ ఈ ఆహారాలను తీసుకుంటే గంటలోనే తేడాను గమనించవచ్చు.

జీర్ణక్రియకు ఎక్కువ సమయాన్ని తీసుకొనే కొవ్వు పదార్ధాలు కూడా గ్యాస్ కి కారణం అవుతాయి.

పిండిపదార్ధాలు అధికంగా వుండే, బంగాళదుంప, మొక్కజొన్న, గోధుమ తయారీలు, బ్రెడ్ మొదలైనవి కూడా గ్యాస్ సమస్యలను పెంచుతాయి.
Share on Google Plus