హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించుకోవటానికి Best Tips

Hyper pigmintation :హైపర్ పిగ్మెంటేషన్ అనేది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనపడుతుంది. హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న ప్రాంతం నల్లని పాచెస్ లేదా నల్లని మచ్చలతో ఉంటుంది. హైపర్ పిగ్మెంటేషన్ సమస్య అనేది ముఖ్యంగా మెలనిన్‌ ఎక్కువగా ఉత్పత్తి కావటం వలన వస్తుంది. దీని వలన చర్మ టాన్ లేదా చర్మం రంగులో మార్పులు వస్తాయి.

మెలనిన్ ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు హైపో పిగ్మెంటేషన్ సమస్య వస్తుంది. ఈ సమస్య పలితంగా చర్మం మీద తెల్లని మచ్చలు లేదా కొన్ని
ప్రాంతాల్లో చర్మం రంగు మారటం జరుగుతుంది.

1. బంగాళదుంప
హైపర్ పిగ్మెంటేషన్ వలన వచ్చే టాన్, నల్లని మచ్చలను తొలగించుకోవటానికి ఇది బాగా ప్రసిద్ది చెందిన చికిత్స అని చెప్పవచ్చు.

కావలసినవి
బంగాళదుంప సగం ముక్క ( చీలికలుగా కోయాలి)

చేసే విధానం
* బంగాళదుంప ముక్కను సన్నని ముక్కలుగా కోయాలి.
* ప్రభావిత ప్రాంతాన్ని ఈ ముక్కలతో సున్నితంగా రబ్ చేయాలి.
* రబ్ చేసిన తర్వాత 15 నిముషాలు అలా వదిలేయాలి.
* ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.
* ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

అలాగే మీరు బంగాళదుంప రసాన్ని తీసి ప్రతి రోజు ప్రభావిత ప్రాంతంలో రాసిన మంచి పలితాన్ని పొందవచ్చు.

2. తేనె మరియు నిమ్మకాయ రసం
తేనెలో తేమ గుణాలు ఉంటే నిమ్మకాయ సహజ బ్లీచ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. నిమ్మరసంలో నీటిని కలపాలి. ఎందుకంటే నిమ్మలో ఉండే ఆమ్లం చర్మానికి చికాకును కలిగిస్తుంది)హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించుకోవటానికి ఒక సులభమైన పద్ధతి గురించి తెలుసుకుందాం.

కావలసినవి
నిమ్మ రసం - 2 స్పూన్స్
తేనే - 2 స్పూన్స్

చేసే విధానం
ఒక బౌల్ లో నిమ్మరసం,తేనే తీసుకోని బాగా కలిపి ప్రభావిత ప్రాంతంలో రాసి 20 నిముషాలు అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఒక నెల పాటు ప్రతి రోజు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

3. విటమిన్ E మరియు కలబంద రసం
కలబంద పిగ్మెంటేషన్ కి బాగా పనిచేస్తుంది. ఇది చర్మంలో మృత కణాలను తొలగించి కొత్త చర్మ కణాలు పునరుత్పత్తికి సహాయపడుతుంది.

కావలసినవి
కలబంద రసం
విటమిన్ E క్యాప్సిల్ లేదా విటమిన్ E ఆయిల్

చేసే విధానం
కలబంద ఆకు నుంచి గుజ్జు ని తాజాగా ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి. ఈ గుజ్జు ని ప్రభావిత ప్రాంతంలో రాసి 20 నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇంకా మంచి పలితాలను పొందటానికి కలబంద గుజ్జులో కొన్ని చుక్కల విటమిన్ E ఆయిల్ ని కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే మంచి పలితాన్ని పొందవచ్చు.

4. తేనె మరియు పాలు
ఈ ప్యాక్ హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించుకోవటానికి ఒక సులభమైన మార్గం.

కావలసినవి
పాలు - 2 స్పూన్స్
తేనే - 1 స్పూన్

చేసే విధానం
ఒక బౌల్ లో పాలు, తేనే వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో రాసి ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
Share on Google Plus