జ్యూసులతో గొంతు నొప్పి మాయం అవుతుందా?

సాదారణంగా శీతాకాలంలో ఉండే చలి గాలుల వలన జలుబు,దగ్గు,గొంతు నొప్పి వంటివి వస్తుంటాయి. వీటి నివారణకు యాంటి బయాటిక్స్ వాడటం తప్పనిసరి అవుతుంది. ఆ విధంగా వాటిని వాడుతూ, మనం ఇంటిలోనే కొన్ని రకాల జ్యూసులను తయారుచేసుకొని త్రాగటం వలన పైన చెప్పిన ఆరోగ్య సమస్యల నుండి తేలికగా తప్పించుకోవచ్చు. మనం ఆ జ్యూస్ల గురించి తెలుసుకుందాం.

నిమ్మరసం
నిమ్మకాయ తీసుకుంటే జలుబు వస్తుందని చాలా మంది నమ్మకం. కానీ అది తప్పని నిపుణులు అంటున్నారు. జలుబు,గొంతునొప్పి ఉన్న సమయంలో ఉదయాన్నే పరకడుపున గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి త్రాగితే మంచి పలితం కనపడుతుంది. నిమ్మలో ఇన్ ఫెక్షన్ అడ్డుకొనే లక్షణాలు ఉన్నాయి

అల్లం రసం
అల్లంలోని యాంటి బ్యాక్టిరియాల్ లక్షణాలు గొంతు నొప్పి తగ్గించటంలో సహాయపడుతుంది. ఉదయాన్నే అరకప్పు తాజా అల్లం రసం త్రాగితే తొందరగా ఉపశమనం కలుగుతుంది. అల్లం తిన్నా కూడా మంచిదే. కానీ అల్లం తినటం కన్నా అల్లం రసం త్రాగటం మంచిది.

పుదినా
ఒక గ్లాస్ నీటిలో పుదినా ఆకులు వేసి మరిగించి చల్లార్చి ఆ నీటిని వడగట్టి త్రాగాలి. ఇందులో కొంచెం పెరుగు కూడా కలుపుకోవచ్చు. అయితే ఈ జ్యూస్ లు మందులకు ప్రత్యామ్నయం కాదు. ఇవి కేవలం నొప్పి తీవ్రతను మాత్రమే తగ్గటానికి దోహదం చేస్తాయి.
Share on Google Plus