నల్లని మచ్చలు,మొటిమలు తొలగిపోవాలంటే బెస్ట్ ఫాక్స్

Sea Salt Body scrubs In telugu
Sea Salt Body scrubs In telugu : ప్రతి ఒక్కరు చర్మం మచ్చలు లేకుండా అందంగా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల కాస్మొటిక్స్ కూడావాడుతూ ఉంటారు. కానీ ప్రయోజనం మాత్రం కాస్త తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు చెప్పే సముద్ర ఉప్పుతో ఆ సమస్య నుండి సమర్ధవంతంగా బయట పడవచ్చు. అది ఎలాగా అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

నాలుగు స్పూన్ల కొబ్బరినూనెలో రెండు స్పూన్ల సముద్ర ఉప్పును కలిపి స్క్రబ్ గా తయారుచేసుకోవాలి. ఈ స్క్రబ్ ని ముఖానికి రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మంలో మలినాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా ఉంటుంది.

మూడు స్పూన్ల నిమ్మరసంలో మూడు స్పూన్ల సముద్ర ఉప్పును కలిపి ముఖానికి రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే ముఖం కాంతివంతంగా ఉండటమే కాకుండా మంచి రంగు కూడా వస్తుంది.

Share on Google Plus