Aloe Vera : ప్రతి ఒక్కరూ ఇంట్లో కలబంద మొక్కలను తప్పనిసరిగా పెంచుకోవాల్సిందే.. ఎందుకంటే..?



Alovera Health Benefits in Telugu :కలబందలో ఎన్నో బ్యూటీ, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కలబంద మొక్క ఇంటిలో పెంచుకొంటే ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు.

కలబంద ఆకుల రసంలో కాసింత కొబ్బరి నూనె పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మోచేతులు, పాదాల వద్ద నల్లగా ఉన్న ప్రాంతాల్లో పూస్తే చర్మంపై ఉన్న నల్లని మచ్చలు తగ్గుతాయి.

ఉదయం పరగడుపున కలబంద ఆకుల నుంచి తీసిన జ్యూస్ ను త్రాగితే ఉదర సంబంధ సమస్యలు తొలగిపోతాయి.

రోజ్‌ వాటర్‌లో కలబంద రసాన్ని కలిపి చర్మంపై పూస్తే పొడిబారిన చర్మం తిరిగి మెరుస్తుంది.

కలబంద రసంలో ముల్తానీ మట్టి లేక చందనపు పొడిని కలుపుకుని ముఖంపై నున్న మొటిమలకు పూస్తే మొటిమలు తొందరగా తగ్గుతాయి.

కలబంద రసాన్ని ముఖానికి దట్టిస్తే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.

శరీర చర్మం కాలిపోతే కలబంద రసాన్ని కాలి న గాయాలపై పూతలా పూస్తే గాయాలు మటుమాయమౌతా యంటున్నారు.
Share on Google Plus