Hair Fall: వారంలో 2 సార్లు ఇలా చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది

Hair Fall Home Remedies


జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగాలంటే ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కాస్త ఓపికగా చేసుకుంటే చాలా మంచి పలితాలను పొందవచ్చు. అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

1. ఒక బౌల్ లో ఒక టేబుల్ స్పూన్ అవొకాడో గుజ్జు, టీ స్పూన్ తేనె, రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి అయిదు నిమిషాల పాటు బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని హెయిర్ బ్రష్ సహాయంతో తలకు పట్టించి అరగంట తరవాత షాంపూతో తల స్నానం చేయాలి. డ్రై హెయిర్ గల వారు 15 రోజులకి ఒకసారి ఈ మాస్క్ వేసుకుంటే నిర్జీవమైన జుట్టు నిగనిగలాడుతుంది.

2. హెన్నా మిశ్రమంలో మందార ఆకులను పేస్ట్ చేసి కలిపి జుట్టుకు పట్టించి అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

3. ఒక కప్పు పెరుగులో రెండు కోడిగుడ్ల సొనను కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి గంటన్నర తరవాత షాంపూతో తలస్నానం చేయాలి. పది రోజులకి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే నిగనిగలాడే జుట్టు మీకు సొంతం అవుతుంది.
Share on Google Plus