Ajwain Leaves Health Benefits in telugu : మన ఇంటి పెరట్లో పెంచుకోవటానికి ఒక మంచి ఔషధ మొక్క వాము మొక్క. వాము ఆకులలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాము ఆకులు మందంగా ఉండి చక్కని వాసన వస్తూ ఉంటాయి.
వాము ఆకులో ఉండే కొన్ని రసాయనిక సమ్మేళనాలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి ఆకలిని పెంచడానికి, తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కావడానికి అవసరం అయినా ఎంజైములను ఎక్కువగా ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. దాంతో గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు.
అంతేకాక దీనిలో ఉండే థైమాల్, కెర్వకాల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను, ట్రై గ్లిజరాయిడ్స్ ను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే రక్తపోటు నియంత్రణలో ఉండేలా సెహ్స్తుంది.
శ్వాస సంబంధిత సమస్యల ఉపశమనం కొరకు బాగా సహాయపడుతుంది. వాము ఆకులో ఉండే ప్రోటీన్లు శరీరంలో ఎక్కువగా ఉన్న క్యాల్షియాన్ని గ్రహించి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేయడంలో సహాయపడుతుందని ఇటివల జరిగిన పరిశోదనలో తెలిసింది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.