వారంలో రెండుసార్లు కివి పండ్లను తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కొవ్వు కణాలలో కొవ్వును పేరుకుపోకుండా చేసి చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా ప్రోత్సహించి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది.
విటమిన్ C, విటమిన్ E సమృద్ధిగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది. శరీరంలో ఉండే మలినాలను, వ్యర్థ పదార్థాలు అన్నీ తొలగిపోతాయి.
బరువు తగ్గే ప్రణాళికతో ఉన్నవారికి కివి పండు మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఆస్తమా వంటి శ్వాస సంబంధ సమస్యలకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాక శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.