Sore Throat Home remedies In telugu:గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ వచ్చాయంటే ఒక పట్టాన తగ్గవు. వీటిని తగ్గించుకోవడానికి మన ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి పలితం చాలా తొందరగా వస్తుంది.
గొంతు నొప్పిని తగ్గించడానికి తేనే అద్భుతంగా పనిచేస్తుంది. తేనెలో ఉండే లక్షణాలు గొంతు నొప్పి, చికాకును తగ్గిస్తాయి. తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన గొంతులో మరియు శ్వాస నాళాల్లో పేరుకున్న శ్లేష్మాన్ని తగ్గిస్తుంది.
ఒక స్పూను అల్లం రసంలో ఒక స్పూన్ తేనె వేసి బాగా కలిపి తీసుకుంటే గొంతు నొప్పి నుండి చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. అల్లం,తేనే రెండూ కూడా గొంతు సమస్యలను తగ్గించటంలో సహాయపడతాయి.
మనం ప్రతిరోజు వెల్లుల్లిని వంటల్లో వాడుతూ ఉంటాం. వెల్లుల్లిలో యాంటీ మైక్రోబియల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అల్లిసిన్ అనే సమ్మేళనం ఉండుటవలన వెల్లుల్లి గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఒక వెల్లుల్లిపాయ రెబ్బను బుగ్గన పెట్టుకుని 15 నిమిషాల పాటు నమ్ములుతూ రసాన్ని మింగుతూ ఉండాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.