White Hair-తెల్లజుట్టు ఉన్నప్పుడు సాధారణంగా చేసే పొరపాట్లు...మీరు చేస్తున్నారా...?

White Hair Mistakes

White Hair : ఈ రోజుల్లో మారిన జీవనశైలి,ఆహారపు అలవాట్లు,కాలుష్యం,పోషకార లోపం వంటికారణాలతో చాలా చిన్న వయస్సులోనే ఆడ మగ అనే తేడా లేకుండా అందరిలోనూ తెల్లజుట్టు వచ్చేస్తుంది. తెల్లజుట్టు రాగానే అందరూ కాస్త కంగారు పడి ఏమి చేయాలో తెలియక తెల్లజుట్టును పీకేస్తు ఉంటారు.

తెల్లజుట్టును పీకేసిన వారిలో తెల్ల వెంట్రుకలను పీకవచ్చా లేదా అనే సంశయం ఉంటుంది. తెల్లజుట్టుకి నేచురల్ డై వేయాలా సెలూన్ కి వెళ్లి డై వేయించుకోవాలా అనే ఎన్నో రకాల సందేహాలు వస్తాయి. అయితే తెల్లజుట్టు వచ్చినప్పుడు సాధారణంగా చేసే తప్పుల గురించి తెలుసుకుందాం. ఈ తప్పులను అసలు చేయకూడదు.

తెల్లజుట్టును పీకకుండా అలానే వదిలేయాలి. ఎందుకంటే తెల్లజుట్టు కాస్త రఫ్గా ఉంటుంది. దాన్ని పీకినప్పుడు మరల అది తెల్లజుట్టుగానే పెరుగుతుంది. అందువల్ల తెల్లజుట్టు కన్పించిన ఏమి చేయకుండా ఉంటేనే బెటర్. తెల్ల జుట్టును జుట్టు మూలం నుండి అసలు పీకకూడదు. ఇలా పీకటం వలన స్కాల్ప్ఎర్రగా మారి..రక్త సరఫరా అందదు.
అంతేకాక దీనివల్ల జుట్టు మళ్లీ పెరగదు. తెల్లజుట్టు వచ్చినపుడు ఎటువంటి అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తెల్లజుట్టు రావటానికి వారసత్వం, జింక్, ఐరన్ లోపం కూడా కారణమవుతాయి. కాబట్టి తెల్లజుట్టు కనపడగానే వెంటనే నేచురల్ రెమిడీలను ఫాలో అవ్వాలి. స్మోకింగ్ అలవాటు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా తెల్లజుట్టు తొందరగా వచ్చేస్తుంది. అందువల్ల ఆ అలవాటును తగ్గించుకోవాలి.

ప్రతి రోజు షాంపూతో తలస్నానము చేయటం వలన కూడా తెల్లజుట్టు వచ్చేస్తుంది. అందువల్ల షాంపూతో తలస్నానము వారానికి రెండు సార్లు మాత్రమే చేయాలి. జుట్టుకు అమ్మోనియా బేస్డ్ డైని ఎట్టి పరిస్థితిలోను వాడకూడదు.
Share on Google Plus