మష్రుమ్స్ మసాలా ఫ్రై

1 minute read

కావలసినవి:
మష్రుమ్స్ - 250 గ్రా
టొమాటో - ఒకటి (మీడియం సైజు ముక్కలుగా తరగాలి)
కొత్తిమీర - చిన్న కట్ట (సన్నగా తరగాలి)
నూనె - ఒక టేబుల్ స్పూను
నెయ్యి- ఒక టీ స్పూన్
ఉప్పు- తగినంత
కారం- ఒక టీ స్పూన్
అల్లం మసాలా కోసం:
అల్లం- 30 గ్రా
వెల్లుల్లి - 20 గ్రా
ఉల్లిపాయలు - రెండు (మీడియం సైజువి)
పచ్చిమిర్చి - మూడు
లవంగాలు - నాలుగు
దాల్చినచెక్క - అర అంగుళం ముక్క
ఏలకులు - మూడు
కొబ్బరి పేస్టు కోసం:
కొబ్బరి - చిన్న ముక్క
ధనియాల పొడి- రెండు టీ స్పూన్లు
తయారి: 
మష్రుమ్స్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో ఉప్పు, కారం వేసి ఐదు నిమిషాల సేపు ఉడికించాలి. అల్లం మసాలా కోసం తీసుకున్నవాటన్నింటినీ కలిపి గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి, కొబ్బరి, ధనియాల పొడి కలిపి పేస్టు చేయాలి.

పాన్‌లో నూనె, నెయ్యి వేడి చేసి ముందుగా అల్లం మసాలా వేసి వేయించాలి, పచ్చివాసన పోయి నూనె బయటకు తేలే వరకు వేయించిన తర్వాత కొబ్బరి పేస్టు, టొమాటో ముక్కలను వేసి సన్న మంట మీద నాలుగైదు నిమిషాల సేపు వేయించి ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన ఉంచిన మష్రుమ్స్‌ను నీటితో సహా వేయాలి. మసాలాను మష్రుమ్స్‌ను కలిపి కొత్తిమీర వేసి పది నిమిషాల సేపు ఉడికించాలి. దగ్గర అయిన తర్వాత దించేయాలి.


buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top