Pepper : మిరియాలు ఎన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయో తెలుసా ? ఎలా వాడాలంటే ?

Black Pepper benefits In telugu


Pepper benefits : అతి చవకగా లభించే మిరియాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. జలుబు, దగ్గు, అజీర్ణ సమస్యలకు ఇవి చక్కటి ఔషధం. కాసిన్ని మిరియాలు నోటిలో వేసుకుంటే గొంతునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

అజీర్ణం, ఆకలి లేకపోవడం
మిరియాలు జీర్ణశక్తిని పెంపొందిస్తాయి. 5గ్రాముల మిరియాల పొడిని ఒక కప్పు బట్టర్‌మిల్క్‌తో కలిపి తీసుకుంటే జీర్ణసంబంధ సమస్యలు తొలగిపోతాయి. పేగులలో ఉన్న ఇన్‌ఫెక్షన్లు తగ్గిపోతాయి. 

ఆహారం జీర్ణమయ్యేందుకు అవసరమైన హైడ్రోక్లోరికామ్లం ఉత్పత్తి కావడానికి మిరియాలు సహాయపడతాయి. జీర్ణాశయంలో ఎక్కువ సేపు ఆహారం నిలువ ఉండకుండా చూస్తాయి. మిరియాల పొడిని అల్లం రసంతో కలిపి తీసుకుంటే అజీర్ణ సమస్య నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

మిరియాలు, అల్లం కలిపి తయారుచేసిన చట్నీ తీసుకుంటే శరీరం పునరుజ్జీవం వస్తుంది. ఆకలి లేని వారికి మిరియాలు దివ్యౌషధం. మిరియాలతో చేసిన డికాషన్‌ను తీసుకుంటే ఆకలి పుడుతుంది. మిరియాల పొడిని, ఒక స్పూన్ తేనెతో కలిపి తీసుకుంటే మంచి ఆకలి కలుగుతుంది. మిరియాల రసం తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

జలుబు, జ్వరం
జ్వరంతో బాధపడుతున్నప్పుడు మిరియాలు కాచిన నీరు తాగితే జ్వరం తగ్గుముఖం పడుతుంది. అధిక జ్వరంను తగ్గించడానికి మిరియాలు చక్కగా ఉపకరిస్తాయి. మిరియాల కషాయంను రోజూ రెండు సార్లు తీసుకుంటే సాధారణ జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

దంతక్షయం, గొంతు నొప్పి
మిరియాలు వేసి మరిగించిన నీరు పుక్కిలించి ఉమ్మితే పంటి నొప్పి తగ్గుతుంది. గొంతు నొప్పితో బాధపడే వారు కొన్ని మిరియాలు నోటిలో వేసుకుని చప్పరిస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది.

మలబద్ధకం
రోజూ రెండు సార్లు మిరియాల డికాషన్‌ను తీసుకుంటే మలబద్ధకం తొలగిపోతుంది. మిరియాలతో చేసిన బ్లాక్‌టీ డికాషన్‌ను తీసుకుంటే నులిపురుగుల సమస్య తొలగిపోతుంది.

డీటాక్సిఫికేషన్
మిరియాలతో చేసిన బ్లాక్‌టీ డికాషన్‌ను తీసుకుంటే మూత్రం సాఫీగా వస్తుంది. చెమట పోస్తుంది. తద్వారా శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి.

చర్మవ్యాధులు, గాయాలు
మిరియాల పొడిని, నెయ్యితో కలిపి రాసుకుంటే ఎగ్జిమా, స్కేబిస్, ఇతర అలర్జీ సమస్యలు, చర్మ వ్యాధులు తగ్గుముఖం పడతాయి. మిరియాల పొడిని, పసుపుతో కలిపి మూడు, నాలుగు రోజుల పాటు ముఖానికి రాసుకుంటే మొటిమలు ఇట్టే తగ్గిపోతాయి. గాయలు తగిలినపుడు మిరియాల పొడి పెడితే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. రక్తస్రావం ఆగిపోతుంది.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top