Kerala Crime Files Season 2: సరికొత్త క్రైమ్‌ కథాంశంతో ‘కేరళ క్రైమ్‌ ఫైల్స్‌2’.. ట్రైలర్‌ వచ్చేసింది.. చూసేయండి

Kerala Crime Files Season 2
Kerala Crime Files Season 2:అజు వర్గీస్, లాల్, జిన్జ్ షాన్, నివాస్ వాలిక్కున్ను, శ్రీజిత్ మహదేవన్ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ‘కేరళ క్రైమ్ ఫైల్స్’ 2023లో డిస్నీ+హాట్‌స్టార్ (ప్రస్తుతం జియో హాట్‌స్టార్) ఓటీటీ వేదికపై విడుదలై, థ్రిల్లింగ్ అనుభవాన్ని అందించింది. 

ఈ సిరీస్‌కు కొనసాగింపుగా ‘కేరళ క్రైమ్ ఫైల్స్: ది సెర్చ్ ఫర్ సీపీవో అంబిలి రాజు’ (సీజన్ 2) సిద్ధమైంది. అహ్మద్ కబీర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌కు బహుల్ రమేశ్ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు సమకూర్చారు. జియో హాట్‌స్టార్ ఇటీవల ఈ సిరీస్‌కు సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌ను బట్టి, సరికొత్త క్రైమ్ కథాంశంతో ఈ సిరీస్ రూపొందినట్లు తెలుస్తోంది.

ట్రైలర్‌లో ‘తిరువనంతపురం జిల్లాలో ఐదుగురు ఎస్‌హెచ్‌వోలు, వివిధ స్టేషన్‌లలోని 12 మంది సివిల్ పోలీసులు ఈ రోజు సస్పెండ్ అయ్యారు’ అనే వాక్యంతో కథ మొదలవుతుంది. ఈ పోలీసులు ఎందుకు సస్పెండ్ అయ్యారు? వారు ఎవరి కోసం వెతుకుతున్నారు? 

చివరికి వారు కోరుకున్న వ్యక్తి దొరికారా లేదా? అన్న ప్రశ్నలు సిరీస్‌లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ‘ప్రపంచం అంతే సర్... క్రిమినల్స్ మంచిగా ఉండాలని మనం ఏమాత్రం ఆశించకూడదు’ అనే సస్పెండ్ అయిన పోలీసు అధికారి డైలాగ్‌తో ట్రైలర్ ముగుస్తుంది, ఇది సిరీస్‌పై ఉత్కంఠను మరింత పెంచుతోంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top