Chandamama Raave


చందమామ రావే జాబిల్లి రావే 
కొండెక్కి రావే కోటిపూలు తేవే 
బండెక్కి రావే బంతిపూలు తేవే 
నట్టింట రావే అమ్మాయికి ఇవ్వవే
తేరు మీద రావే తేనే పట్టు తేవే 
పల్లకిలో రావే పాలు పెరుగు తేవే 
పరుగెత్తి రావే పనస పండు తేవే 
అలవకుండా రావే అరటి పండు తేవే 
అన్నింటిని తేవే అబ్బాయికి ఇవ్వవే.    
Share on Google Plus