వంశపారంపర్యం
"వెంకయ్యగారూ... ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది" చెప్పాడు డాక్టర్.
"అమ్మయ్య... బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి" చెప్పాడు వెంకయ్య.
ఏ పక్క
"మీ ఆవిడా, మీ అమ్మా సూర్యాకాంతం, ఛాయాదేవిల్లా రోజూ పోట్లాడుకుంటునప్పుడు నువ్వే పక్క నిలిచుంటావు?" సుధాకర్‍ను అడిగాడు కరుణాకర్.గోడపక్క" చెప్పాడు సుధాకర్
భయం
"నాకూ, మా ఆవిడకు ఏమైనా గొడవయితే నేను వెంటనే మా ఇంట్లో బావిని చెక్కతో మూసి ఉంచుతాను""ఏం.... మీ ఆవిడ అలిగి నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుందని భయమా?""కాదు..... నన్ను తోసేస్తుందని."
పట్టుదల
" పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్" అన్నాడు నరసింహం
"అలాగా.... అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం" ఎదురన్నాడు కుర్రాడు.
గాడిదలు తినవు ...
రాము : నా ప్లేట్లో నుంచి లడ్డూలు తిసుకున్నావేమిటి ?
సోము : గాడిదలు లడ్డూలు తినవని ఇంతకుముందు నువ్వే చెప్పావు కదా!
చాక్లెట్
టీచర్: ఒరేయ్ రాజూ చాక్‌లెట్స్‌లో ఎక్కువగా ఏ ప్రాడక్ట్స్‌ని కలుపుతారు ?
రాజు: నాకు తెలీదు సార్... !
టీచర్: బుద్దిలేదురా నీకు ఆ మాట అనడానికి, అది కూడా తెలీదా ... !
మళ్ళీ టీచర్: సరే అయితే ఇది చెప్పు, మనకి పంచదార ఎక్కడ నుంచి వస్తుంది ?
రాజు: పక్కింటి వాళ్ళింట్లో నుంచి టీచర్ ... !
టీచర్: ఆఆఆఆఆఆ ... !
Jokes
teluguLifestyle Editor
11:15:00 AM
teluguLifestyle Editor
నమస్తే.. నేను Telugu Lifestyle Editor గా ఆరోగ్యం, బ్యూటీ, మరియు మన దైనందిన జీవితాన్ని సులభతరం చేసే ఇంటి చిట్కాలపై మక్కువతో గత కొన్నేళ్లుగా ఆర్టికల్స్ రాస్తున్నాను. బిజీ లైఫ్స్టైల్లో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కెమికల్స్ లేని సహజసిద్ధమైన పద్ధతుల్లో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయాలను స్పష్టమైన తెలుగులో, అందరికీ అర్థమయ్యేలా అందించడమే నా లక్ష్యం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవనశైలి కోసం నేను అందించే నిత్య జీవిత చిట్కాలను ఫాలో అవ్వండి. అలాగే మరిన్ని వివరాలు మరియు వీడియో అప్డేట్స్ కోసం నా youtube చానల్ https://www.youtube.com/@VaishRecipes ని కూడా ఫాలో అవండి.