Pumpkin



పోషకాల పంటు గుమ్మడి

అత్యధిక ఔషధ విలువల కలిగిన వాటిల్లో గుమ్మడికాయ ఒకటి. రోజూ తీసుకునే ఆహారంలో గుమ్మడి ఉండేలా చూసుకోవడం ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు.
ప్రొస్టేట్ క్యాన్సర్
ప్రొస్టేట్ గ్రంథి ఆరోగ్యంగా ఉండాలంటే గుమ్మడికాయను రోజూ ఆహారంలో తీసుకోవాల్సిందే. గుమ్మడి గింజలలో ప్రొస్టేట్‌ను రక్షించే పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. టెస్టోస్టిరాన్ హార్మోన్ డైహైడ్రోటెస్టోస్టిరాన్(డీహెచ్‌టి)గా మారకుండా నిరోధించే కెమికల్స్ ఇందులో ఉన్నాయి. డిహెచ్‌టి లెవెల్స్ పెరిగితే ప్రొస్టేట్ గ్రంథి పెరుగుతుంది. ప్రొస్టేట్ గ్రంథి పెరగుండా చూసుకోవాలంటే కనీసం వారంలో మూడు సార్లు 30 గ్రాములు ఉడికించిన గుమ్మడి గింజలను తినాలి.

చర్మ సంరక్షణ
గుమ్మడిలో యాంటీఅక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ఏ, సి, జింక్, అల్ఫాహైడ్రాక్సియాసిడ్స్ ఇందులో ఉన్నాయి. ఇవి వయసుపై బడినపుడు కనిపించే లక్షణాలను తగ్గిస్తాయి. చర్మం ముడతలు పడటాన్ని నిరోధిస్తాయి. పలు సౌందర్య ఉత్పత్తులలో గుమ్మడిని వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. గుమ్మడిని మెత్తగా నూరి పాలతో కలిపి రోజూ ముఖానికి రాసుకుంటే చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. అంతేకాకుండా వాపు, నొప్పి, కాలిన గాయాలకు ఉపశమనం అందిస్తుంది. చర్మాన్ని నునుపుగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

యాంటీ అక్సిడెంట్
గుమ్మడిలో బీటాకెరోటిన్, పొటాషియం, జింక్ పుష్కలంగా లభిస్తాయి. రోజూ తీసుకునే ఆహారంలో బీటాకెరోటిన్ లోపించినట్లయితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువని పరిశోధనల్లో వెల్లడయింది. కాబట్టి గుమ్మడిని మెనూలో ఉండేలా చూసుకోవడం ద్వారా క్యాన్సర్‌కు చెక్‌పెట్టొచ్చు.

రోజూ తీసుకునే ఆహారంలో పొటాషియం తక్కువగా ఉన్నట్లయితే హైపర్‌టెన్షన్ వచ్చే అవకాశం పెరుగుతుందని అధ్యయనంలో తేలింది. అరటిపండ్లు, బ్రొక్కొలీ, అవొకడోస్, దానిమ్మ, గుమ్మడిపండులో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలపరచడంలో జింక్ సహాపడుతుంది. అస్టియోపొరోసిస్ బారిన పడకుండా కాపాడుతుంది. ఎముకలు ధృడంగా అయ్యేలా చూస్తుంది. ఆహారంలో ఫైబర్ ఎక్కువగా తీసుకోవడం చాలా అవసరం. ఫైబర్ అధికంగా తీసుకుంటే క్యాన్సర్, గుండె జబ్బులు దరిచేరవు. ల్యుకేమియా, స్కెలెరోసిస్ వంటి వ్యాధుల నివారణలో గుమ్మడి గింజల వినియోగం పెరుగుతోంది.

కొలెస్టరాల్, మలబద్ధకం
గుమ్మడి గింజల నుంచి తీసిన నూనె కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది. గుండె జబ్బులతో బాధపడే వారు గుమ్మడిని వేయించుకుని తినడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. గుమ్మడిని తింటే మలబద్ధకం సమస్య ఇట్టే తొలగిపోతుంది.

అల్సర్, అసిడిటీ
అల్సర్, అసిడిటీతో బాధపడే వారు గుమ్మడి జ్యూస్‌ను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రోజుకు మూడు సార్లు భోజనానికి అరగంట ముందు గుమ్మడి జ్యూస్‌ను తీసుకోవాలి. ఇన్సోమ్నియాకు ఇది మంచి ఔషధం.

హార్మోనల్ యాక్టివిటీ
హార్మోనల్ డిజార్డర్స్‌తో బాధపడేవారు గుమ్మడిని తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. మెనోపాజ్ సమస్యలు, హైపర్ ఎక్సైటబిలిటీ, అడాలసెంట్ బిహేవియర్ వంటి సమస్యలు తగ్గిపోతాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top