Simhasana


సింహాసనం   :
సింహం అడవికి రాజు. అది ఎంత కఠినమైన ఆహారం తిన్నా అరిగించుకుంటుంది. సింహం తరచూ గర్జించడం వల్ల దాని లోపలి అవయవాలు చురుగ్గా తయారవుతాయి. సింహ ఆసనం వేసేవాళ్లకూ ఆ ఆరోగ్య ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఫోటోలో చూపిన విధంగా కాళ్లు మడిచి కూర్చున్నాక, చేతులు ముందుకుచాపి నిటారుగా వంగాలి. నోరు పెద్దగా తెరిచి, నాలుకను బయట పెట్టి సింహంలా గర్జించాలి. కంఠం, ఛాతీ పూర్తిగా తెరుచుకోవాలి.
ప్రయోజనం  :
కంఠానికి సంబంధించి ఎలాంటి వ్యాధులున్నా ఈ ఆసనం వాటిని పోగొడుతుంది. మెదడును చురుగ్గా ఉంచుతుంది. కళ్లు, ముక్కు, చెవుల పనితీరును మెరుగు పరుస్తుంది. పిత్తాశయంలో రాళ్లు చేరకుండా కాపాడుతుంది. ఒకవేళ ఇప్పటికే రాళ్లు ఏర్పడి ఉంటే.. మూత్రం ద్వారా బయటికి పంపుతుంది ఈ ఆసనం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top