Black Pepper Rasam - మిరియాల రసం

From paneer
మిరియాల రసం
కావలసినవి:
టొమాటోలు - 2
(గ్రైండ్ చేసుకోవాలి)
చింతపండు రసం - కప్పు
ఆవాలు, జీలకర్ర - టీ స్పూన్
వెల్లుల్లి రేకలు - 4
మిరియాలపొడి - టీ స్పూన్
జీలకర్ర పొడి - అర టీ స్పూన్
ఎండుమిర్చి - 2
కరివేపాకు - రెండు రెబ్బలు
కొత్తిమీర - టేబుల్ స్పూన్
ఉప్పు - సరిపడా
పసుపు - చిటికెడు
నూనె - 2 టీ స్పూన్లు
ఇంగువ - చిటికెడు
పంచదార - అర టీ స్పూన్
తయారి:
1.పాత్రలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర చిటపటలాడించాలి. వెల్లుల్లి, ఎండుమిర్చి వేయించాలి.

2.కొత్తిమీర, పసుపు, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేయాలి.

3.జీలకర్ర పొడి, మిరియాల పొడి జత చేసి టొమాటో గుజ్జు, చింతపండు పులుసు, ఉప్పు, పంచదార వరుసగా వేసి సరిపడా నీళ్లు పోయాలి. 10 నిమిషాల వరకు మరిగించి దింపేయాలి.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top