అష్ట భుజాలు, అస్త్ర, శస్త్రాల వెనుక ఆధాత్మిక రహస్యం


సంగమ యుగంలో పరమాత్ముని సహాయంతో దివ్య గుణాలను ధారణ చేసి దుర్గుణాలపై విజయం పొందిన దేవతే విజయదుర్గ. అష్ట శక్తులను పొందిన దానికి గుర్తుగా దేవికి అష్ట భుజాలను చూపుతారు.

త్రిశూలం: మూడు కాలాల, మూడులోకాల, రహస్యాన్ని తెలుసుకొని త్రినేత్రిగా అయిన దానికి గుర్తు.
ఖడ్గం: జ్ఞాన ఖడ్గంతో అసురీ గుణాలను సంహరించిన దానికి గుర్తు.
కమలం: సంసార సాగరంలో ఉంటూ అతీతంగా అతి ప్రియంగా అయిన దానికి గుర్తు
శంఖం: జ్ఞాన శంఖాన్ని పూరించి అజ్ఞాన నిద్రలో ఉన్న వారిని మేల్కొలిపిన దానికి గుర్తు.
గద: పరమాత్మ స్మృతి అనే గదతో చెడు గుణాలను వధించిన దానికి గుర్తు.
చక్రం: స్వ(ఆత్మ) దర్శనం తనలోని అవగుణాలను సమాప్తి చేసుకున్న దానికి గుర్తు.
కాగడా: జ్ఞాన జ్మోతితో అందరిలోని అజ్ఞానమును తొలగించిన దానికి గుర్తు.
అభయ హస్తం: సర్వాత్మలను అనేక కర్మబంధనాల నుండి విడిపించి సర్వేశ్వరునితో సర్వ సంబంధాలు ఏర్పరిచి సుఖశాంతులను ప్రసాదించిన దానికి గుర్తు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top