క్యారెట్ గులాబ్‌జామ్



కావలసిన పదార్థాలు :
క్యారెట్ తురుము-ఒక కప్పు
కొబ్బరి తురుము-ఒక కప్పు
పంచదార-రెండు కప్పులు
గులాబ్‌జామ్ పౌడర్-200 గ్రా
జీడిపప్పు-50 గ్రా
బాదం పప్పు-50 గ్రా
పాకానికి పంచదార-అర కేజి
నెయ్యి-అర కప్పు(వేగించడానికి)
యాలకుల పొడి-ఒక టీస్పూన్
తయారుచేసే విధానం : 
ఒక బాణలి స్టవ్‌పై ఉంచి, కొద్దిగా నెయ్యి వేసి ముందుగా అందులో జీడిపప్పు, బాదంపప్పు ముక్కలు వేసి అవి వేగాక, క్యారెట్ తురుము వేసి వేగించాలి. తరువాత కొబ్బరి తురుము కూడా వేసి అయిదు నిమిషాలు వేగించి, తరువాత పంచదార వేసి కాస్త దగ్గరగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి.

చివరగా యాలకుల పొడి చల్లి దించేయాలి. తరువాత మరో పాత్ర స్టవ్‌పై ఉంచి అందులో కాసిని నీళ్లు, పంచదార వేసి లేత పాకం వచ్చే వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. సువాసన కోసం ఈ పాకంలో యాలకుల పొడిగాని, రోజ్ వాటర్‌గాని కలుపుకోవచ్చు
 తర్వాత గులాబ్‌జామ్ పౌడర్‌లో నీళ్లు పోసి ఉండలు చేసుకునేందుకు వీలుగా పిండిని కలిపి అయిదు నిమిషాల పాటు నాననివ్వాలి. ఈలోపు క్యారెట్ హల్వాను కూడా చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత గులాబ్‌జామ్ పిండిని కొద్దిగా చేతిలోకి తీసుకుని చిన్న పూరీలా ఒత్తి అందులో క్యారెట్ ఉండను ఉంచి అంచులు కలిపేసి ఉండగా చేసుకోవాలి. ఇలా తయారైన ఉండలను చిన్న మంటపై ముదురు రంగు వచ్చేంత వరకు నేతిలో వేగించి తీసి పంచదార పాకంలో వేయాలి.
 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top