పక్షవాతానికి బ్రేక్

దీర్ఘకాలిక అంగవైకల్యాన్ని కలిగించే అతిపెద్ద సమస్య పక్షవాతం(స్ట్రోక్). ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాణాంతక వ్యాధుల్లో పక్షవాతం మూడవ స్థానాన్ని ఆక్రమించింది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన వారిలోనే కనిపించే ఈ సమస్య గత పదేళ్లుగా 30 నుంచి 40 ఏళ్ల లోపు వారిలోనూ ఎక్కువగానే కనిపిస్తోంది.

స్త్రీలకన్నా పురుషులే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడతారు కానీ, దీని కారణంగా చనిపోయే వారిలో స్త్రీలే ఎక్కువగా ఉంటున్నారు. భారత దేశం, చైనా లాంటి దేశాల్లో 2050 నాటికి పక్షవాతం కేసులే 80 శాతం దాకా నమోదయ్యే అవకాశం ఉండబోతోందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.అయితే పక్షవాతం లక్షణాలు కనిపించిన తక్షణమే ఆసుపత్రికి తరలించగలిగితే ఈ పరిస్థితిని చాలా వరకు నిరోధించవచ్చని అంటున్నారు.

               ఒకసారి పక్షవాతానికి గురయ్యాక వ్యాధి తాలూకు దుష్ప్రభావ ం లేకుండా బయటపడేవారు తక్కువగానే ఉంటారు.కానీ, వ్యాధికి గురైన మూడు గంటల లోపే ఆసుపత్రికి తరలిస్తే ఆ నష్టాన్ని బాగా తగ్గించే అవకాశాలు ఉంటాయి. కానీ, అదే జరగడం లేదు. వాస్తవానికి పక్షవాత రోగుల్లో చికిత్స తరువాత కేవలం 10 శాతం మందే పూర్తిగా కోలుకుంటారు. ఓ 30 శాతం మంది అతి తక్కువ లోపాలతో బయటపడతారు. ఇక మిగిలిన వారిలో 40 శాతం మంది తీవ్రమైనలోపాలతో ఉండిపోతారు. నడవడం కష్టమవుతుంది.

           అంతకు ముందు చేసే పనులేవీ సవ్యంగా చెయ్యలేని పరిస్థితిలోనే జీవితాంతం ఉండిపోతారు. ఇక మిగతా వారు చనిపోతారు. మొత్తంగా చూస్తే 10 నుంచి 20 శాతం మంది మాత్రమే ఏలోపమూ లేకుండా సమస్యనుంచి పూర్తిగా విముక్తులవుతున్నారు. అందుకే పక్షవాతం రాకుండా నివారించడమే శ్రేయస్కరం. పక్షవాతానికి గురైన ఆ వ్యక్తే కాదు అతడిపై ఆధారపడిన కుటుంబం కూడా రోడ్డున పడుతుంది.


పక్షవాతం కారణంగా మరణించే వారిలో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా ఉంటారు. గర్భధారణ, గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం, మైగ్రేన్ తలనొప్పి, ఇంకొన్ని హార్మోన్ సమస్యలే ఇందుకు కారణంగా ఉంటాయి.
ఎందుకిలా?
వివిధ కారణాలతో ఒక్కోసారి మెదడులోని ఏదో ఒక భాగానికి రక్తసరఫరా హఠాత్తుగా ఆగిపోవడం గానీ లేదా తగ్గిపోవడం గానీ జరగవచ్చు. ఆ స్థితిలో మెదడులోని ఆ భాగానికి సంబంధించిన విధులు ఆగిపోతాయి లేదా కుంటుపడతాయి. ఈ సమస్యనే పక్షవాతం అంటారు.
            ఈ స్థితిలో ముఖ్యంగా కదలికలు, సర్శ జ్ఞానం, మాట, వినికిడి, బ్యాలెన్స్ ఇలాంటి కీలక క్రియలు కుంటుపడతాయి. పక్షవాతంలో వీటిని నియంత్రించే నాడీ కణాలు దెబ్బ తినడమే ఇందుకు కారణం. పక్షవాతం వివిధ రకాలుగా ఉంటుంది. వాటిలో ఆర్టీరియల్ స్ట్రోక్, వీన్స్ స్ట్రోక్ అనే రెండు ప్రధానంగా ఉంటాయి. రక్తనాళాలను దెబ్బ తీసేవి ఒకరకమైతే, సూక్ష్మ రక్తనాళాలను దెబ్బ తీసేవి మరోరకం.


మనం చూస్తున్న వాటిలో ఆర్టీయల్ స్ట్రోక్సే ఎక్కువగా ఉంటాయి. వీటిలోనూ మళ్లీ ఇస్కీమిక్ స్ట్రోక్స్, హెమరేజిక్ స్ట్రోక్స్ అంటూ రెండు రకాలు ఉంటాయి. రక్తసరఫరా ఆగిపోవడం వల్లగానీ, తగ్గిపోవడం వల్ల గానీ వచ్చే పక్షవాతాలను ఇస్కీమిక్ స్ట్రోక్స్ అంటారు. రక్తనాళాల ఒరిపిడితో రక్తస్రావం కావడం వల్ల వచ్చే పక్షవాతాన్ని హెమరేజిక్ స్ట్రోక్స్ అంటారు.


ఇస్కీమిక్ స్టోక్స్ 80 శాతం హెమరేజిక్ స్ట్రోక్స్ 20 శాతం ఉంటాయి. రక్తస్రావాలు అనే వి మెదడులోపలైనా కావచ్చు లేదా మెదడు పై ఉండే పొరల్లో అయినా కావచ్చు. పక్షవాతంలో నొప్పి ఉంటుంది అనే అపోహ చాలా మందిలో ఉంది. నిజానికి ఏవో ఒకటి రెండు సందర్భాల్లో తప్ప చాలా వరకు పక్షవాతంలో ఏ నొప్పీ ఉండదు.
 ఇస్కిమిక్ స్ట్రోక్ లక్షణాలు
పక్షవాతం లక్షణాలు ఎప్పుడూ హఠాత్తుగానే మొదలవుతాయి. ఈ సమస్య ఎక్కువగా తెల్లవారు జామున వస్తుంది. లేదా బాగా రాత్రయ్యాక వస్తుంది. శరీరంలో ఏదో ఒక భాగం కాలో, చెయ్యో పడిపోవచ్చు. ఒకవేళ పూర్తిగా పడిపోకపోయినా, పట్టు కోల్పోవడం వంటివి ఉంటాయి.


ఇవే కాకుండా శరీరంలోని కొన్ని భాగాల్లో స్పర్శ తెలియకపోవడం, మొద్దుబారినట్టు ఉండడం, పొడిచినట్లు అనిపించడం, హఠాత్తుగా కళ్లు తిరగడం మొదలై వాంతులు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో హఠాత్తుగా చూపుపోవడం, హఠాత్తుగా వినికిడి శక్తిపోవడం, శరీరంలోని ఏ అవయవమైనా హఠాత్తుగా పనిచేయకుండా పోవడం జరగవచ్చు. జ్ఞాపకశక్తిలో కూడా కొన్ని సమస్యలు తలెత్తుతాయి.


అంటే మొన్నటి విషయాలు, ఈరోజు విషయాలూ జ్ఞాపకం ఉండి నిన్నటి విషయాలు మరిచిపోవడం జరగవచ్చు. అలాగే హఠాత్తుగా మాట పడిపోవడం లేదా చెప్పాలనుకున్నది చెప్పలేకపోవడం, లేదా అవతలి వ్యక్తి చెప్పే మాటలు అర్థం కాకపోవడం, మాట ముద్దముద్ధగా, తడబడిన ట్లుగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిలో ఏ ఒక్క లక్షణం కనిపించినా పక్షవాతంగా అనుమానించి వెంటనే ఆసుపత్రికి తరలించాలి.
హెమరేజిక్ స్ట్రోక్ లక్షణాలు
హఠాత్తుగా తీవ్రమైన తలనొప్పి రావడం, వికారం, వాంతులు, మూర్ఛ రావడం, కోమాలోకి వెళ్లడం వంటి లక్షణాలే ప్రధానంగా కనిపిస్తాయి. రక్తపోటు అమితంగా పెరగడం ఈ సమస్యకు ప్రధాన కారణం. అలాగే రక్తనాళాల్లో బుడిపెల్లాంటివి వచ్చి అవి రక్తపోటు పెరిగినప్పుడు ఒరిపిడికి గురవుతాయి. ఇది కూడా హెమరేజ్ స్ట్రోక్‌కు దారి తీస్తుంది. బుడిపెలు వచ్చిన ప్రదేశాన్ని, రక్తస్రావ తీవ్రతను బట్టి అది కలిగించే నష్టం ఉంటుంది.


టిఐఎ (ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ అటాక్) పక్షవాతం వచ్చిన 24 గంటల వ్యవధిలోనే రోగి నార్మల్ అయిపోతే దాన్ని టిఐఎగా గుర్తిస్తారు. మామూలుగా అయితే ఈ అటాక్ 20 నిమిషాలకు మించి ఉండదు. అందుకే చాలా మంది ఆ విషయంలో డాక్టర్ వద్దకు వె ళ్లడం అనవసరం అనుకుంటారు. నిజానికి ఇది మునుముందు తీవ్రమైన పక్షవాతం రాబోతోందని చెప్పే సూచిక .


వెంటనే ఆసుపత్రికి తరలించడానికి ఇది ఒక సువర్ణావకాశం. వెంటనే న్యూరాలజిస్టును సంప్రదిస్తే ఆ తరువాత పెద్ద పక్షవాతం రాకుండా నివారించవచ్చు. మెదడులోని ఏ భాగంలోనైనా పక్షవాతం వస్తే దానికి సంబంధించి ఒక కేంద్రంగా ఉండే భాగమంతా చ నిపోతుంది. రక్తసరఫరా ఆగిపోవడంతో ఆక్సీజన్ అందకపోవడం వల్ల వచ్చే పరిణామమిది.
ఈ స్థితిలో నిమిషానికి దాదాపు 11లక్షల కణాలు చనిపోతాయి. అలా చనిపోయిన భాగాన్ని ఇన్‌ఫాక్ట్ కోర్ అంటాం. అప్పటికే చనిపోయిన కణాల విషయంలో చేయగలిగేదేమీ ఉండదు. ఇంకా పూర్తిగా దెబ్బ తినని భాగాన్ని కాపాడటమే అప్పుడు కర్తవ్యమవుతుంది. అయితే కణాలు చనిపోయిన భాగానికి చుట్టూ ఉండే (పెనుంబ్రా) ప్రదేశం కూడా దుష్ప్రభావానికి గురవుతుంది.


అయితే, ఈ భాగానికి రక్తసరఫరా చాలీచాలని రీతిలో ఉంటుంది. ఇది కణాలు చనిపోయేంత తక్కువ కాదు. అలా అని వాటిని ఆరోగ్యంగా ఉంచగలిగేటంతా కాదు. అయితే వెంటనే చికి త్స అందకపోతే కొంత వ్యవధిలో ఈ భాగం కూడా పూర్తిగా చనిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. వాస్తవానికి పక్షవాతంలో ఇచ్చే చికిత్సలన్నీ ఈ పెనుంబ్రాను కాపాడేందుకు చేసేవే. పక్షవాతానికి గురైన వ్యక్తిని మూడు గంటల్లోపు తీసుకు వస్తేనే ఈ చికిత్సకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి.


ఏంచేయాలి?
60 ఏళ్లు దాటాక పక్షవాతం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే వారసత్వ మూలాలు కూడా ఇందుకు కారణంగా ఉంటాయి. అయితే వృద్ధాప్యాన్ని గానీ, వంశానుగత మూలాలను గానీ ఎవరూ చేయగలిగిందేమీ లేదు. కానీ, మనం నియంత్రించగలిగే వాటి విషయంలో మాత్రం శ్రద్ధ వహించాలి. అధికర క్తపోటును, మధుమేహాన్ని పూర్తి నియంత్రణలో ఉంచుకోవాలి. ప్రతి ఇంటా ఒక గ్లూకోమీటర్, బిపి మెషిన్ ఉంచుకుని తరుచూ పరీక్షించుకుంటూ ఉండాలి.
పొగ తాగడం, మాదక ద్రవ్యాల వాడకం పూర్తిగా మానే యాలి. అలాగే మద్యం చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవడం, కొలెస్ట్రాల్ నియంత్రణ, వ్యాయామానికి ప్రాధాన్యతనివ్వడం, స్థూలకాయం రాకుండా చూసుకోవడం, గుండె జబ్బుల విషయంలో నిర్లక్ష్యం వహించకపోవడం చాలా ముఖ్యం. పక్షవాత నివారణలో రక్తపోటు నియంత్రణ అతి కీలకమైనది. ఈ నియంత్రణ కూడా వ్యక్తి వ్యక్తికీ వేరుగా ఉంటుంది. ఒక వ్యక్తికి 120/80 నార్మల్ అయితే అందరికీ అదే నార్మల్ కాదు.


వేగంగా...
పక్షవాతం లక్షణాలుగా ఏ కాస్త అనుమానం కలిగినా వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాలి. వీలైనంత వరకు న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్‌లు ఉన్న ఆసుపత్రికి వెళ్లడం మంచిది. రోగి వెంట వచ్చిన వ్యక్తులు అతడు రోజూ వేసుకునే మాత్రల గురించి, కొద్ది రోజులుగా ఉన్న అతని ఆరోగ్య పరిస్థితిని చెప్పగలగాలి.


లేదా ఆ మందుల చీటీ అయినా తప్పనిసరిగా వెంట తీసుకు రావాలి. ఇది ప్రాధమిక పరీక్షల కాలాన్ని తగ్గిస్తుంది. పక్షవాతానికి చేసే చికిత్సలను ఎంత తొందరగా ఇస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి. ప్రత్యేకించి టిపిఎ లాంటి ప్రత్యేక చికిత్సలకు పక్షవాతం సోకిన మొదటి మూడు గంటలు కీలక సమయం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నాలుగున్నర గంటలదాకా ఇచ్చే వీలుంది. అలా అని చివరి నిమిషం దాకా గడపకుండా తక్షణమే తరలించడం అత్యంత ప్రధానం.
                
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top