![]() |
అయినప్పటికీ వీరి కాంబినేషన్‌లో సినిమా చేయడానికి పలువురు దర్శకులు ప్రయత్నాలు చేశారు. కానీ సాధ్యపడలేదు. ఇక ఈ కాంబినేషన్ కలవాలంటే వారి గురువు ‘కె.బాలచందర్’ రంగంలోకి దిగాల్సిందేనని, ఆయన ఒక్కడి వల్లే అది సాధ్యమవుతుందని చాలామంది అభిప్రాయపడ్డారు కూడా. కానీ బాలచందర్ మాత్రం.. ‘ఇప్పుడు ఈ హీరోలతో సినిమా చేయలేను. ఒకప్పుడు వాళ్లకు ఇమేజ్ ఉండేది కాదు. నేను అల్లుకున్న కథలుతో వారితో సినిమాలు చేశాను. ఇప్పుడు వాళ్ల ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని సినిమా చేస్తే.. నా కథ కిల్ అవుతుంది’ అని ఓ సందర్భంలో పేర్కొన్నారు.
దాంతో ఈ సూపర్‌స్టార్ల కలయికలో ఇక సినిమా వచ్చే అవకాశం లేదని చాలామంది ఫిక్స్ అయ్యారు. అయితే ఇప్పుడా అభిప్రాయాన్ని మార్చుకోవచ్చని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రముఖ దర్శకుడు శంకర్ వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా చేయడానికి కథ తయారు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్‌లో పెద్ద బేనర్‌గా వెలుగుతున్న ‘సన్ పిక్చర్స్’ ఈ చిత్రాన్ని నిర్మించనుందట. ఈ చిత్రాన్ని దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించడానికి కళానిధి మారన్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
ఇటీవలే రజనీకాంత్‌తో ‘రోబో’లాంటి సంచలనాత్మక చిత్రాన్ని అందించారు శంకర్. ఈ చిత్రానికి అయిన బడ్జెట్ 200 కోట్లకు పైనే అనే వార్తలు అందాయి. ‘రోబో’ను నిర్మించిన సన్ పిక్చర్స్ ఇప్పుడు రెట్టింపు బడ్జెట్‌తో రజనీ, కమల్, శంకర్ కాంబినేషన్‌లో సినిమా ప్లాన్ చేస్తోంది కాబట్టి ఇది కచ్చితంగా ‘రోబో-2’ అయ్యుంటుందని పరిశీలకులు అంటున్నారు. ఏమైనా ఈ ‘కళ్లు చెదిరే కాంబినేషన్’లో సినిమా వస్తే ప్రేక్షకులకు కనువిందు అని చెప్పొచ్చు.