![]() |
ఆపిల్ ఒక్కటి ఉంటే చాలు ఏమయినా చేయొచ్చు. ఆపిల్‌ను సన్నని ముక్కలుగా కట్ చేసి వాటితో ముఖానికి మసాజ్ చేయాలి. ఆయిలీ స్కిన్‌కు ఇది ఇంట్లో చేసుకోగలిగిన సింపుల్ ట్రీట్మెంట్. ఇలా చేయడం వల్ల చర్మరంధ్రాల్లో దాగిన అదనపు ఆయిల్ పోతుంది. జిడ్డు రావడాన్ని కంట్రోల్ చేస్తుంది కూడా. బనానా ఫేషియల్ క్రీమ్ బాగా పండిన అరటిపండును పావు భాగం తీసుకుని మెత్తగా చిదిమి మెత్తగా అయ్యేవరకు కలపాలి. దీనిని ముఖానికి పట్టించి పదిహేను లేదా ఇరవై నిమిషాల తర్వాత ముందుగా వేడినీటితోనూ తరువాత చల్లటి నీటితోనూ కడగాలి. కడిగిన తర్వాత ముఖాన్ని తుడవకుండా గాలికి ఆరనివ్వాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం మెరవడంతో పాటు పాటు ముడతలను కూడా నివారిస్తుంది. ఆరెంజ్ పీల్ నేచురల్ బ్లీచ్ కమలాపండు తొక్కలు, పాలు తీసుకోవాలి. కమలా తొక్కలను ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పౌడర్‌లో పాలు కలిపి పేస్టులా చేసుకుని ముఖానికి ప్యాక్ వేసి అరగంట తరవాత కడగాలి. ఇలా రోజూ కాని రెండు రోజులకొకసారి కాని చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది నేచురల్ బ్లీచ్. చర్మానికి హాని కలిగించకుండా తెల్లబరుస్తుంది. ముఖం మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ కూడా రంగు మారి చర్మపురంగుతో కలిసిపోతుంది.
| |||