N T R 'బృందావనం' - Trailer


ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమ సంస్థ నిర్మించిన 'బృందావనం' చిత్రం విజయదశమి సందర్భంగా ఈ నెల 14న విడుదలవుతుందని నిర్మాత రాజు వెల్లడించారు.ఈ సినిమాలో లుక్ పరంగా, పాటలు, ఫైట్ల పరంగా ఎన్టీఆర్ చాలా కొత్తగా కనిపిస్తాడు. 'ఆది' సినిమాతో స్టార్, 'సింహాద్రి'సినిమాతో సెన్సేషనల్ స్టార్ అయిన ఆయన 'బృందావనం'తో ఫ్యామిలీలకు బాగా దగ్గరవడమే కాదు యూనివర్సల్ హీరో అవుతాడు. చిత్ర విజయం పట్ల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. టాప్ త్రీ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందని మళ్లీ చెబుతున్నాను' అన్నారు.

పాజిటివ్, హ్యాపీ ఫిలిం. ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలని మొదట అనుకోలేదు. అయితే సాంకేతికంగా సినిమా బాగా రావడానికి పనిదినాలు పెరగడంతో విడుదల తేదీలు మారుతూ వచ్చాయి. ఇప్పుడు సినిమా సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్. బబ్లీగా, లవబుల్‌గా, మాస్‌గా, సందేశాత్మకంగా, కామెడీగా.. ఇలా విభిన్న కోణాల్లో కనిపిస్తారు' అన్నారు. ఛాయాగ్రాహకుడు ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ 'దిల్‌రాజు బేనరుకు తగ్గ విధంగా, ఎన్.టి.ఆర్. ఇమేజ్‌కి అనుగుణంగా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రకథ వినగానే దర్శకుని అభిరుచి, నిర్మాత అభిరుచి, ఎన్.టి.ఆర్. ఇమేజ్ వేర్వేరుగా ఉంటాయి కదా ఈ మూడూ ఎలా కుదురుతాయి అనిపించింది. అయితే సినిమా చూశాక నా అనుమానం తీరింది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top