Telugu Funny Jokes -5

అర్థం కావడంలేదు
‘‘డాక్టర్‌గారూ! మీరు నాకు ఎలాగయినా సహాయం చేయాలి...’’ అన్నాడో ముసలాయన డాక్టర్ దగ్గరకొచ్చి.
‘‘ఏమిటి సంగతి?’’ అడిగాడు డాక్టరు.
‘‘చూడండి! నాకిప్పుడు తొంభయ్ ఏళ్లు! అయినా కూడా ఆడపిల్లల వెంట పడుతున్నాను.’’
‘‘అందులో తప్పేముందండీ!’’
ముసలాయన కళ్ల నీళ్ళు పెట్టుకున్నాడు.
‘‘తప్పు సంగతి కాదండీ నేననేది. వాళ్ల వెంట పడుతున్నానుగానీ ఎందుకు పడుతున్నానో గుర్తుండి చావటం లేదు.’’
రెండు వందలు
రకరకాలయిన వస్తువుల వేలంపాట చాలా జోరుగా సాగుతోంది.
హఠాత్తుగా వేలం వేసేవాడు గట్టిగా అరిచాడు.
‘‘ఇక్కడ కొద్దినిమిషాల క్రితం ఒక పెద్దమనిషి రెండువేల రూపాయలున్న పర్సు పోగొట్టుకున్నాడు. ఆ పర్సు దొరికినవారు వెంటనే తిరిగి ఇస్తే వందరూపాయలు
బహుమతిగా ఇవ్వబడుతుంది!’’
ఓ నిమిషం నిశ్శబ్దం
తరువాత ఓ మూలనుంచి ఎవరో అరిచారు.
‘‘రెండు వందలు!’’

పెళ్లొద్దు బాబోయ్!

 "అబ్బాయి ఇంజనీరింగ్ చదివాడట, మంచి ఉద్యోగంలో ఉన్నాడట, ఆస్తిపరుడట, బుద్ధిమంతుడట ...పైగా సినిమా హీరోలా కూడా ఉన్నాడట ... మరి పెళ్లి చేసుకోనంటావేం?'' ఆశ్చర్యంగా అడిగింది సుమలత.
"ఏ సినిమా హీరో అని అడగవేం ... 'పా'లో హీరో కూడా హీరో నేనా?'' విచారంగా చెప్పింది చారులత.

నేనొస్తా!
"ఏయ్ రిక్షా...బస్టాండ్‌కు ఎంత?''
"20 రూపాయలివ్వండి''
"రెండ్రూపాయలకొస్తావా?''
"రెండు రూపాయలకు ఎవరూ రారు''
"నేనొస్తాను పద. నీవు రిక్షాలో కూర్చో. నే తొక్కుతా''
'మండే' సూర్యుడు
ప్రసాద్, సూర్య మగధీర సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. అందులో అఘోరా చెప్పిన డైలాగ్‌ని సూర్యతో చెబుతున్నాడు ప్రసాద్.
"వాడు 'మండే' అగ్నిగోళంలా కనిపిస్తాడు...'' ఇంతలో...
"మరి ట్యూస్‌డే ఎలా ఉంటాడు'' అడిగాడు సూర్య.
ఒళ్లు మండిన ప్రసాద్ నువ్వింకొక నాలుగొందలేళ్లయినా మారవా అన్నాడు.
బే ఖాతర్!
"నేను పాఠం చెబుతున్నప్పుడు వినకపోయినా పర్వాలేదు, పడుకున్నా పర్వాలేదు ... మీరు మాత్రం క్లాసులో ఉండాలి. బయటకి మాత్రం వెళ్లకూడదు...'' లెక్చరర్ మాటని ఖాతరు చెయ్యకుండా నిదానంగా బయటకి వెళ్లాడొక స్టూడెంట్.
"అదేంటి? నేను చెప్పేది అర్థం కావట్లేదా నీకు'' వెళ్తున్న స్టూడెంట్ వైపు కోపంగా చూస్తూ అన్నాడు లెక్చరర్.
"వాడికి నిద్రలో నడిచే అలవాటుంది సార్'' చెప్పాడు మరో స్టూడెంట్.


block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top