![]() |
కావలసిన పదార్థాలు :
శనగపిండి-ముప్పావు కిలోనూనె-ఒక కేజి
పంచదార-ఒక కేజి
యాలకుల పొడి-ఒక టీస్పూన్.
తయారుచేసే విధానం :
ఒక పాత్రలో శనగపిండి, నీళ్లు పోసి బూందీ వేయడానికి వీలుగా పిండిని కాస్త జారుడుగా కలుపుకోవాలి. స్టవ్‌పై కళాయి ఉంచి నూనె పోసి అది బాగా మరిగాక బూందీ దూసే గరిటెలో శనగపిండిని వేసి చేతితో కలుపుతూ ఉంటే కళాయిలో బూందీ పడుతూ ఉంటుంది.
ఈ బూందీని వేగిన తరువాత తీసి మరో గిన్నెలో ఉంచుకోవాలి. మరో కళాయి స్టవ్‌పై ఉంచి అందులో పంచదార, నీళ్లు పోసి కాస్త లేత పాకం రాగానే బూందీని అందులో వేసి ఆపకుండా ఒక పావుగంటపాటు కలుపుతూ ఉండాలి. ఇందులో యాలకుల పొడి వేసి మళ్లీ ఒకసారి బాగా కలిపి అర చేతికి నెయ్యి లేదా నూనె రాసుకుని లడ్డూలుగా చుట్టుకోవాలి.