![]() |
సాధారణంగా అధికరక్తపోటు, మూర్ఛలతో బాధపడే వాళ్లకు చిగుళ్లు వాస్తే ఎక్కువగా ఉన్న చిగుళ్లని ఇంకో ప్రోగ్రామ్‌తో కత్తి రించవచ్చు. మరో ప్రోగ్రామ్‌తో చిగుళ్లని ఓపెన్ చేయకుండానే కాంతి కిరణాలతో లోపల దెబ్బతిన్న చిగుళ్ల కణాన్ని మాడ్చి వేయవచ్చు. నోట్లో చీముగడ్డలు ఏర్పడితే వాటిని తీసి వేసే ప్రోగ్రామ్ ఉంది. కొంతమందిలో రెండు పళ్లమధ్య ఫ్రీనమ్ అనే కండరము ఏర్పడుతుంటుంది. దీంతో పళ్లమధ్య సందులు ఏర్పడతా యి. అలా సందులు ఏర్పడకుండా ఫ్రీనమ్‌ని తీసి వేయ వచ్చు లేజర్ కిరణా లతో. ఇలా చెప్పుకుంటూపోతే ఇంకా ఎన్నో ప్రోగ్రామ్లున్నాయి సాఫ్ట్ టి ష్యూ చికిత్సలకి. ఒక్కమాటలో చెప్పాలంటే నోటిలోని మెత్తటి కణాలన్నింటి కీ సంబంధించిన ప్రోగ్రామ్‌తో ఉన్నాయి ఈ లేజర్ చికిత్సా యంత్రంలో.
ఇక హార్డ్ టిష్యూ..గట్టి కణాల చికిత్సకొస్తే అవీ 40 రకాల వరకూ ఉన్నాయి. డెంటిన్‌ని, ఎనామెల్ని కట్ చేయవచ్చు. పంటి మీద ఎత్తుపల్లాలు ఏర్పడి క్రమంగా పళ్లలో కంతలు ఏర్పడవచ్చు. ఇలా పళ్లు పుచ్చి పోకుండా కంతలు ఏర్పడుతున్న ప్రదేశాన్ని ‘ఫిట్ అండ్ ఫీజర్ సీలింగ్ పద్ధతి’లో మూసి వేస్తారు. లేజర్ కిరణాలతో పన్నునే కాదు, ఎముకనీ కట్ చేయవచ్చు. పుచ్చిన పళ్లని తీసివేయ వచ్చు. ఫ్లోరోసిస్‌వల్ల పళ్ల మీద పసుపు పచ్చని పొర ఏర్పడుతుంటే దాన్నీ తీసివేయవచ్చు. పళ్ల పై భాగంలో సెన్సిటి వ్నెస్ ఎక్కువగా ఉంటే లేజర్ కిరణాలతో ఆ భాగాన్ని డిసెన్సిటైజ్ చేయవచ్చు.
ఎక్కువున్న చిగుళ్లని కట్‌చేయవచ్చు. గ్రాన్యులేషన్..అంటే పాడైపోయిన కణాన్ని కచ్చితంగా అంతవరకే తీసివేయవచ్చు. నోట్లో ఏర్పడే రకరకాల గడ్డల్ని హార్డ్‌లేజర్‌తో తొలగించవచ్చు.
![]() |
చిన్నపిల్లల్లో కొందరికి పళ్లు చిగుళ్లలో ఉండిపోతాయి. త్వరగా బయటకురావు. అలాంటి పరిస్థితుల్లో లేజర్ కిరణాలతో నొప్పిలేకుండా చిగు ళ్లని కోసి, పళ్లు బయటకు వచ్చేట్టు చేయవచ్చు. పళ్లమీద జెల్‌ని రాసి,లేజర్ కిరణా న్ని నాలుగు నిముషాలు పంపడం తో పళ్లని తెల్లగా చేయవచ్చు. వెస్టిబ్యులోప్లాస్టి. . పెదవి లోపలి వైపు ఎముకని లేజర్ కిరణాలతో కత్తిరించవచ్చు. పంటి చివరిభాగం కోసు కుంటుంటే ఆపదునుని తగ్గించవచ్చు. ఎక్కడ ఎముక ఏమాత్రం ఎక్కువ వున్నా నొప్పిలేకుండా కత్తిరించవచ్చు. జ్ఞానదంతాలు ఓ పట్టాన బయటకు రాకుండా నొప్పి పెడుతుంటే లేజర్ కిరణాలను పంపి నొప్పి లేకుండా పైనున్న చిగుళ్లని కత్తిరించి దంతాలు బయటకు వచ్చేట్టు చేయవచ్చు. ఇలా హార్డ్ టిష్యూ లేజర్‌లో కూడా ఎన్నో ప్రోగ్రా మ్లున్నాయి.
అన్ని రకాల దంత చికిత్సల్ని లేజర్‌తో చేయవచ్చు. మెత్తటి కణా లని చికిత్స చేసి నా, గట్టికణాన్ని కత్తి రించినా నొప్పి ఉండదు. రక్తం కారదు.
చిగుళ్లలో పాడైపోయిన భాగా ల్ని చిగుళ్లని కత్తిరించ కుండా కాంతిని పంపి మాడ్చేయువచ్చు. సైడ్ ఎఫెక్ట్స ఉండవు ఈ చికిత్సలో. చికిత్సకి పట్టే సమయం కూడా మామూలు విధానంతో పోలిస్తే తక్కువ. ఏ ప్రోగ్రామ్ని సెట్‌చేస్తే లేజర్ కిర ణాలు ఆ ప్రోగ్రామ్‌నే చేస్తాయి. మిగతా కణాన్ని ముట్టుకోవు. ఉదాహరణకు చిగుళ్లులోపల దెబ్బతిన్న కణాల్ని మాడ్చటానికి ప్రోగ్రామ్ పెడితే లేజర్ కిరణాలు ఆ కణాలనే మాడ్చే స్తాయి మిగతాకణాల్ని ఏమాత్రం ముట్టు కోకుండా. ఈ లేజర్ యంత్రాలలో కూడా కార్బన్‌డయాకై్సడ్ లేజర్ కన్నా ఎన్డిఆర్ లేజర్ శక్తివంతమైంది. అనస్థేషియా లేకుండానే ఈ శస్తచ్రికిత్సలన్నీ చేయవచ్చు.
స్టెరిలైజింగ్ కోయాగ్యులేటింగ్ ఎఫెక్ట్‌వల్ల మామూలు పద్ధతు లకన్నా ఈ లేజర్ చికిత్స ఎంతో ఉపయోగం. రక్తస్రావం,నొప్పి ఉండవు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స కూడా ఉండవు. మందుల అవసరం ఉండదు. అనస్తేషి యా లాంటివి అక్కర్లేదు.అవసరమైన చోటికే లేజర్ని పంపడం,ఎంత వేగం తో కావాలంటే అంత వేగంతో పంపడం వైద్యుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది.