కావలసిన పదార్థాలు...
ఎండుకొబ్బరి తురుము - అరకప్పు గసగసాలు - మూడు స్పూన్లు
జీడిపప్పు - పావు కప్పు
ఎండుద్రాక్ష - 25
పొడి చేసిన పంచదార - మూడు టేబుల్ స్పూన్లు
బాదం పప్పులు - ఆరు
పిస్తాపప్పు - 8
యాలకుల పొడి - రెండు టీ స్పూన్లు
దోశల పిండి - తగినంత
తయారుచేసే విధానం...
పదార్థాలన్నింటినీ బాగా మిక్స్ చేయండి. దోశ పిండితో మామూలుగా దోశ వేయండి. దానిపై వీటిని తగు మాత్రం వేసకుని ఆయిల్ వేసి దోశ కాలిన తర్వాత జాగ్రత్తగా మడిచి ప్లేటులోకి తీయండి. అంటే డ్రైఫ్రూట్స్ దోశ రెడీ. డ్రైప్రూట్స్ తినడం వలన అదనపు పోషక విలువలు లభిస్తాయి.