![]() |
కొబ్బరినూనె...
దీనిలో లవంగాలు అధికం. కాబట్టి కొబ్బరినూనె శరీ రానికి రాసుకుంటే ముడతలు రాకుండా కాపాడు కోవచ్చు. చర్మం ఏ తరహాకు చెందినది అయినా కొబ్బరి నూనె వాడకం సరైందే. పలు రకాల చర్మ రోగాలు సోకకుండా కాపాడే శక్తి కొబ్బరినూనెకుంది. అందుకే దానికంత ప్రాముఖ్యత.ఆలివ్ నూనె...
చర్మ సౌందర్యానికి ఆలివ్ నూనె ఎంతో చక్కని సాధ నం. దీనిలో వుండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మం వయసుతో వచ్చే మార్పులకు గురికా నివ్వదు. ఆలివ్ నూనె మర్దన చేస్తే చర్మం ఎంతో చక్క ని వెలుగును సంతరించుకుంటుంది.
ఆల్మండ్ ఆయిల్...
ఆల్మండ్ ఆయిల్ చర్మాన్ని ఎండిపోనివ్వదు. ఈ నూనెను రాసుకుంటే చర్మం తేమను గ్రహి స్తుంది. చర్మం ఏ తరహాది అయినా సరే ఈ నూనెను ఉపయోగించవచ్చు. దుర ద, మంట వంటి సమస్యలను రానివ్వదు. చర్మాన్ని పగలకుండా కాపాడుతుంది.
నువ్వుల నూనె...
ఇందులోని విటమిన్ బి, ఇ లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని కాల్షియం, మెగ్నీషియంల ద్వారా చర్మం లబ్ధిపొందుతుంది. సూర్యకాంతి ప్రభావం చర్మం మీద పడకుండా రక్షిస్తుంది. నువ్వుల నూనెతో శరీరం మర్దన చేయించుకుంటే అలసట ఇట్టే పోతుంది. చర్మానికి తాజాదనం సమకూరి ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుంది. జజోబా నూనె...
దీనిలోని సూక్ష్మజీవ సంహారగుణాల వల్ల చక్కని రక్షణనిస్తుంది. చర్మంలో సహజంగా ఉత్పత్తి అయ్యే తైలాలకు, జజోబా ఆయిల్లో ఉన్న రసాయనాలకు దగ్గరి పోలిక కనిపిస్తుంది. అందువల్ల జజోబా నూనెను చర్మం ఎటువంటి ప్రతిచర్య చూపకుండానే గ్రహిస్తుంది. ఇది రాసుకుంటే చర్మానికి ఎలర్జీ వుండదు.