పనీర్: 100 గ్రా
జీడిపప్పు: 100 గ్రా (కచ్చాపచ్చాగా పలుకులు చేయాలి)
కార్న్‌ఫ్లోర్: రెండు టీ స్పూన్లు
జీలకరప్రొడి : టీ స్పూన్
పసుపు: చిటికెడు
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు: చిన్నకప్పు
నూనె: ఫ్రైకి సరిపడ
కొత్తిమీర తరుగు: టీ స్పూన్
పచ్చిమిర్చి తరుగు: టీ స్పూన్
గరంమసాలా పౌడర్: టీ స్పూన్
ఉల్లికాడల తరుగు: టీ స్పూన్
ఉప్పు: తగినంత
తయారి: పనీర్‌ని పది నిమిషాల సేపు వేడినీటిలో ఉంచి తీశాక మెత్తగా చిదమాలి. అందులో కార్న్‌ఫ్లోర్, జీలకరప్రొడి, గరంమసాలాపొడి, ఉల్లిపాయ తరుగు, పసుపు, ఉప్పు, కొత్తిమీర, ఉల్లికాడల తరుగు, పచ్చిమిర్చి తరుగు, జీడిపప్పు పలుకులను ఒక గిన్నెలో వేసి... తగినన్ని నీటితో ముద్దలా కలుపుకోవాలి. బాణలిలో నూనె పోసి వేడిచేయాలి. ఇప్పుడు పై మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకొని అరచేతిలో వేసి కావలసిన షేప్‌లో ఒత్తి కాగిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీయాలి. నూనెలో నుంచి తీసిన వెంటనే టిష్యూ పేపర్ మీద వేస్తే పేపర్ అదనంగా ఉన్న నూనెను పీల్చుకుంటుంది. ఈ పనీర్- కాజు స్నాక్‌కు టొమాటో సాస్ మంచి కాంబినేషన్. ఈవెనింగ్ స్నాక్‌గా చాలా బాగుంటుంది. |